Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్AP PCC Chief Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల

AP PCC Chief Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల

ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎఫెక్ట్ ఎంతంటూ చర్చ

ఎట్టకేలకు అందరూ ఊహించినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ నుంచి హై కమాండ్ ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఏపీ కాంగ్రెస్ లో షర్మిలకు కీలక పదవి అప్పగిస్తారని ఊహాగానాలు సాగాయి. ఇక రానున్న ఏపీ ఎలక్షన్స్, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో షర్మిల పార్టీని ఎలా నడిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

- Advertisement -

కాగా.. షర్మిల ఏపీసీసీ అధ్యక్ష నియామకం పట్ల అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు మల్లు రవి. షర్మిల ఏపీసీసీ అధ్యక్షులుగా నియమించచడం హర్షణీయం.. షర్మిల నియామకం చేసినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా షర్మిల రాజకీయాలలో రాణించాలని ఆకాంక్షించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విదంగానే రాబోయే రోజులలో ఆంద్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మల్లు రవి ఆశాభావం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News