Saturday, November 23, 2024
HomeతెలంగాణTandur: 'తెలుగుప్రభ' కథనానికి స్పందన

Tandur: ‘తెలుగుప్రభ’ కథనానికి స్పందన

తాండూరులో 3 నూతన ఆధార్ సెంటర్లు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నూతనంగా మూడు ఆధార్ అప్డేట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్డీఓ శ్రీనివాసరావు వెల్లడించారు. జనవరి 9న మంగళవారం రోజున తెలుగు ప్రభ దినపత్రికలో ప్రచురించిన ఆధార్.. బెజార్..! ఆధార్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేయించుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతూ తాండూరులో సరిపడా ఆధార్ కేంద్రాలు లేకపోవడం, ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చేందుకు మార్పులు తప్పనిసరి అని కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు దీరుతున్నారు. తాండూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ఒకటే ఆధార్ కేంద్రం ఉండటంతో  తెల్లవారుజామునే అక్కడకు చేరుకుని క్యూలో ఉంటున్నారు.

- Advertisement -

కేంద్రంలో రోజుకు 30 నుంచి 40 టోకెన్ లు ఇస్తూ అప్‌డేట్‌ చేస్తుండడంతో ఎవరికి వారు ముందు నిలవాలని తెల్లవారుజామునే పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకుంటు…పోస్ట్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున జనాలు ఆధార్ అప్డేట్ కోసం వందల సంఖ్యలో క్యూలో ఉంటూ అవస్థలు పడుతూ ప్రభుత్వం స్పందించి ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను పెంచాలని ప్రజలు కోరారు.

తెలుగుప్రభ ప్రచురించిన వార్తలపై స్పందించిన ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని తాండూరులో 3 నూతన ఆధార్ అప్డేట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలలో ప్రస్తుతానికి పేర్లు మార్పిడి, ఫోన్ నెంబర్ మార్పిడి, బయోమెట్రిక్ మాత్రమే వీలుందని తెలిపారు. ప్రజలు ఆధార్ అప్డేట్ కేంద్రాల అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News