Sunday, October 6, 2024
HomeతెలంగాణMahabubnagar: 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించు కోవాల్సిందే

Mahabubnagar: 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించు కోవాల్సిందే

సంపూర్ణ అంధత్వ నివారణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో సుడిగాలి పర్యటన చేసి కంటివెలుగు బృందాలను సర్వసన్నదం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించే విధంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయగా క్షేత్రస్థాయిలో వాటిని అమలు పరిచేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యల పై ఒక్కో బృందానికి ప్రశ్నలు వేసి సన్నద్ధత పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక్కో బృందాన్ని లేపి తమ బృందంలో ఏ సభ్యులు ఎలాంటి సన్నద్దత చేశారు, వైద్య శిబిరానికి అవసరమైన మౌళిక వసతులు, జనాలకు షామియాన, టేబుళ్లు, కుర్చీలు, విద్యుత్ సౌకర్యం, మరుగు దొడ్లు సౌకర్యం వంటి ఏర్పాట్లు చేశారా అని ప్రశ్నించారు. కంటి పరీక్షల యంత్రాలు అన్ని వచ్చాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

కంటివెలుగు మొదటి విడతలో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిందని ఈ సారి కంటివెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కనున్నందున నాగర్ కర్నూల్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News