పగిడ్యాల మండలం పడమర పాతకోట గ్రామంలో శ్రీ కాశీ నందీశ్వర స్వామి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం శ్రీ కాశీశ్వర, నందీశ్వర దేవలయ కమిటీ సభ్యులు క్రీడలు మరియు వృషభ రాజుల అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఉస్మాన్ భాష హాజరై వృషభ రాజుల అంతరాష్ట్ర బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 22 జతల పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం మార్కెట్ డైరెక్టర్ ఉస్మాన్ భాష మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించుకునే సంస్కృతి సంప్రదాయపరమైన తిరునాళ్ల మహోత్సవములు ప్రజలందరిని ఒక చోట చేరుస్తూ ఐక్యమత్యంతో, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహంతో వేడుకలను ఆస్వాదిస్తూ సంతోషంగా జరుపుకోవడం ఎంతో శుభ పరిణామం అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వేడుకలో పాల్గొనడం, వివిధ రాష్ట్రాల నుండి బండలాగుడు పోటీలో పాల్గొనడానికి వృషభ రాజులు నిర్వాహకులు పాల్గొనడం, క్రీడాకారులు పాల్గొనడం వారు ప్రదర్శించే ప్రదర్శనను తిలకిస్తూ ప్రజలు సంతోషంగా గడపడానికి తిరుణాలలు వేడుకలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సంక్రాంతి పర్వదినములో ఇలాంటి తిరునాళ్లు ప్రజలందరి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నందీశ్వర కాశీశ్వర దేవాలయ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.