శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లేందుకు తాండూరు నుంచి శివ స్వాములు బయలుదేరారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర్ ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తాండూరు నుండి శ్రీశైలంకు మహా పాదయాత్రగా బయల్దేరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాండూరు నుంచి శ్రీశైలంకు శివ భక్తులు వెళ్తున్నట్టు బీఆర్ఎస్ తాండూరు నేత సాగర్ గౌడ్ అన్నారు. రసూల్ పూర్ హనుమాన్ ఆలయం వద్ద 120 మంది భక్తులతో స్వాములకు అల్పాహారం అందజేశారు. ఈ మహా పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు జరగకుండా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధికి క్షేమంగా చేరుకొని దర్శించుకోవలని స్థానికులంతా పూజలు చేశారు.