Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుHit and Run: 71 ఏళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన స్కూటర్

Hit and Run: 71 ఏళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన స్కూటర్

పట్టపగలే ఓ వ్యక్తిని ఢీ కొట్టిన స్కూటర్ ఆ వ్యక్తిని అలాగే ఈడ్చుకుంటూ కొంత దూరం వెళ్లే వీడియో ఒళ్లు గుగుర్పొడిచేలా చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడయాలో ఇది వైరల్ గా మారింది. బెంగళూరులోని బిజీ రోడ్డుపై సాహిల్ అనే వ్యక్తి స్కూటర్ మీద పోతూ.. 71 ఏళ్ల ముత్తప్ప అనే వృద్ధుడిని ఢీ కొట్టాడు. ఆతరువాత స్కూటర్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. ఇదంతా ప్రమాదవశాత్తే జరిగినా పోలీసులు రంగంలోకి దిగి తక్షణం నిందితుడిని అరెస్టు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత నిర్లక్ష్యంగా సాహిల్ అనే 25 ఏళ్ల వ్యక్తి డ్రైవ్ చేశాడని పోలీసులు మండిపడ్డారు. కాగా ప్రమాదంలో ముత్తప్ప గాయాలపాలయ్యాడు..ఇదంతా కెమెరాలో రికార్డు అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News