Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్KTR: త్వరలో రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడతారు

KTR: త్వరలో రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడతారు

మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ..

మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారని, 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులు, అంతా ప్రధానమంత్రికి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుచేస్తూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు అదానీ దొంగని రేవంత్ రెడ్డి అన్నారన్న కేటీఆర్, అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానితో అలైబలై చేసుకుంటున్నాడని నిప్పులు చెరిగారు.

- Advertisement -

ఈ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న కేటీఆర్, కాంగ్రెస్ ఢిల్లీలో అదానితో కొట్లాడుతూ… ఇక్కడ మాత్రం ఎందుకు అదానితో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలన్నారు. బిజెపి ఆదేశాల మేరకే అదానితో ఇక్కడి ప్రభుత్వము, ఇక్కడి ముఖ్యమంత్రి కలిసి పని చేస్తున్నారని, అదాని పట్ల మారిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి కారణాలు ఏంటో చెప్పాలన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 అయ్యాయన్నారు.

ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే… ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మళ్ళీ వచ్చినయ్, ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి పంచే పరిస్థితి మళ్ళీ వచ్చిందని, ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News