Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan released funds: పేదలందరికీ ఇళ్ళు-లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

Jagan released funds: పేదలందరికీ ఇళ్ళు-లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు-లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈమేరకు సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

- Advertisement -

పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి స్వంత ఇంటి కలను నిజం చేస్తూ నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్న నేపధ్యంలో అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని తానే భరిస్తున్న వైయస్‌.జగన్‌ ప్రభుత్వం.

ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి రూ.4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను క్యాంపు కార్యాయలం నుంచి బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ షర్మిలారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.ఎండీ. దీవాన్‌ మైదిన్, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ లక్ష్మీషా, సెర్ప్‌ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News