నవసర కాంట్రవర్సీస్ కు దూరంగా ఉండాలంటే మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్న సత్యాన్ని ఎట్టకేలకు బాలీవుడ్ గ్రహించింది. అందుకే బాలీవుడ్ సెలబ్రిటీలు స్లోగా సోషల్ మీడియాకు దూరమవుతుండగా, లేటెస్ట్ గా మీడియాకు, యు ట్యూబ్ ఛానెల్స్ కు, సినిమా వెబ్సైట్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వటానికి నో చెబుతున్నారు. కేవలం సినిమా పాటలు, ట్రైలర్స్ వంటివే సినిమాకు అసలైన ప్రమోషనల్ సరుకులని వీరు ఇప్పటికైనా గ్రహించటం మంచిదైందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
ట్రోలింగ్, బ్యాన్, బాయ్ కాట్ వంటివి వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు సినిమా బృందాన్ని మాస్ మీడియాకు దూరంగా ఉంచితే చాలనే ఉద్దేశంలో ఇటు యాక్టర్లు, అటు డైరెక్టర్లు ఉన్నారు. లో ప్రొఫైల్ లో ఉంటే బాయ్ కాట్ బెడదే ఉండదని వీరు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నట్టు ప్రముఖ సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వివరిస్తున్నారు.
ప్రీ రిలీజ్ లో భాగంగా విచ్ఛలవిడిగా ఇంటర్వ్యలు ఇచ్చేస్తున్న సెలబ్రిటీలు ఇకమీదట చాలా డిగ్నిఫైడ్ గా సైలెంట్ గా ఉండనున్నారు. అదేమంటే ఇదే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ ట్రేడ్ సీక్రెట్ గా మారింది. దృశ్యం 2 సినిమా టైంలో ఇలాగే చేసి.. పెద్ద హిట్ కొట్టారు దృశ్యం టీం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పఠాన్ సినిమాకు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే షారూఖ్ ఖాన్, దీపికా పదుకున్, జాన్ అబ్రహం మీడియాకు దూరంగా ఉంటున్నారు. కేవలం షారూఖ్ మాత్రమే ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో పలు దఫాలుగా ఇంటరాక్ట్ అవుతున్నారు.