మల్లాపూర్ మండల పరిషత్ పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బిఆర్ యస్ పార్టీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు తమ ఎంపీటీసీలు చేజిక్కకుండా ముందు జాగ్రత్తగా ఎంపీటీసీలని క్యాంప్ కు తరలించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలు చేయడంతో, తమ ఎంపీటీసీలు బి ఆర్ యస్ నుండి కాంగ్రెస్ పార్టీకి పోకుండా ఉండేందుకు ముందుగానే విహారయాత్ర పేరిట క్యాంప్ మొదలుపెట్టారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీపై బి ఆర్ యస్ నేతలే గుర్రుగా ఉండటంతో దాన్ని అనుకూలంగా మలచుకునేందుకు అధికార పార్టీ మార్క్ రాజకీయం చేస్తుంది. అధికార పార్టీ మార్క్ రాజకీయాలతో కంగారు పడ్డ బి ఆర్ యస్ నేతలు క్యాంప్ మొదలు పెట్టారు. క్యాంప్ కు ఎనిమిది మంది సభ్యులను తరలించినట్లు, కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.. రాబోయే రోజుల్లో మండలంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Mallapur Mandal Parishad Politics: మండుతున్న మల్లాపూర్ మండల పరిషత్ రాజకీయాలు
క్యాంపు రాజకీయాలు గులాబీని గట్టెక్కిస్తాయా?