Thursday, September 19, 2024
HomeతెలంగాణMayor Vijayalakshmi: ప్రజావాణి ఫిర్యాదులు వారంలో పరిష్కరించాలి

Mayor Vijayalakshmi: ప్రజావాణి ఫిర్యాదులు వారంలో పరిష్కరించాలి

86 కంప్లైట్స్ లో 62 హౌసింగ్ పైనే

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.  జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లు ప్రజల నుండి విన్నపాలు స్వీకరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ…  ప్రజల సమస్యల పరిష్కారానికి ఇక నుండి ప్రతి సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం జోన్, సర్కిల్ కార్యాలయంలో  ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిష్కరించి నివేదిక ను ప్రతి శనివారం అందజేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీ కి రశీదు ఇవ్వాలని స్వీకరించిన ప్రతి దరఖాస్తు ను వారం రోజుల్లోనే పరిష్కరించాలని ఆదేశించారు. అట్టి విన్నపం ఎన్ని రోజుల్లో పరిష్కరించబడుతుందని లిఖిత పూర్వకంగా అర్జీదారునికి  తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

రెండు పడకల గదులు అలాట్ చేసిన లబ్ధిదారులకు జిహెచ్ఎంసి నుండి విద్యుత్ మీటర్ కోసం, నల్లా కనెక్షన్ల కోసం డబ్బులు చెల్లించాలని ఎవ్వరికీ ఫోన్ చేయడం లేదని కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించాలని లబ్ధిదారులకు ఫోన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లించాలని ఫోన్ చేస్తున్నారని వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని మేయర్ అన్నారు.
రెండు పడకల గదులు మంజూరు అయిన వారు కాలనీ సమీపంలో గల విద్యుత్ మీటర్ నల్ల కనెక్షన్ కోసం జారీచేసిన పట్టా సర్టిఫికెట్ జిరాక్స్ కాపీని జత చేస్తూ  చేసుకోవాలని మేయర్ లబ్దిదారులను కోరారు. జిహెచ్ఎంసిలో ప్రజావాణి కోవిడ్ సందర్భంగా నిర్వహించ లేదని, తిరిగి హెడ్ క్వార్టర్ లో  ఈ  నెల 22 నిర్వహించనున్నట్లు అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని మేయర్ వివరించారు. 

డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… స్వీకరించిన ప్రతి దరఖాస్తును వారం రోజుల్లోగా తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను కోరారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయంలో కూడా  ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. ప్రధాన కార్యాలయంలో మొత్తం 86 విన్నపాలు వచ్చాయని, అందులో 62 విన్నపాలు హౌసింగ్ కు సంబంధించిన ఎక్కువగా వచ్చాయని మేయర్, డిప్యూటీ మేయర్  తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ జియా ఉద్దీన్ అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, యాదగిరిరావు, జయరాజ్ కెనడి, సరోజ, ప్రేమ చందర్ రెడ్డి,, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయక్, సి.ఇ దేవానంద్, కిషన్  హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, చీఫ్ ఎంటామాలోజి డాక్టర్ రాంబాబు, యస్ సి ఎస్ డబ్లు ఏం కోటేశ్వర రావు. ఓ యస్ డి అనురాధ, ఇ ఇ మమత, డైరెక్టర్ యు బి డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News