Sunday, October 6, 2024
Homeనేషనల్Eggs: కోడి గుడ్ల కొరత.. రోజూ ఇదే సమస్య

Eggs: కోడి గుడ్ల కొరత.. రోజూ ఇదే సమస్య

మహారాష్ట్రలో కొత్త కష్టం వచ్చిపడింది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ కోటి కోడి గుడ్ల కొరత వస్తోంది. దీంతో రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి క్రమంగా పెరిగేలా చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. మహారాష్ట్రలో రోజుకు కనీసం 2.25 కోట్ల గుడ్లను తింటారు. కానీ రాష్ట్రం మొత్తంగా చూస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే కోడి గుడ్ల సంఖ్య కోటి నుంచి కోటి 25 లక్షలు మాత్రమే. దీంతో ప్రస్తుతం కర్నాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి కోడి గుడ్లను సేకరిస్తున్నారు. గత రెండు నెలలో మహారాష్ట్ వ్యాప్తంగా గుడ్ల ధరలు బాగా పెరిగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News