ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లాంటివి పత్రికలని, సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సిన బృహత్తరమైన భాద్యత పత్రికల మీద ఉందని మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలుగుప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….పత్రికలు సమాజ శ్రేయస్సు కోరుతూ, ప్రజల కష్టాలు తెలిసే విదంగా వార్తలు రాయాలని, సంచలనాల కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. విలువలతో కూడిన వార్తలు పత్రిక గొప్పతనాన్ని తెలుపుతుందని, సమాజంలో తద్వారా గౌరవ ప్రదమైన స్థానం లభిస్తుందని చెప్పారు. తెలుగుప్రభ దినపత్రికలో వార్తలు సమాజ హితం కోరి ఉంటున్నాయని, ఇది ఇలాగే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుప్రభ ప్రతినిధి ఏముల వెంకట్, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జీ సి జె బెనహర్, సిరాజ్ ఖాద్రి, గోనెలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.