Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Our Constitution is great: ప్రపంచ దేశాలకు ఆదర్శం మన రాజ్యాంగం….

Our Constitution is great: ప్రపంచ దేశాలకు ఆదర్శం మన రాజ్యాంగం….

భారత రాజ్యాంగ రచనా భారమంతా అంబేద్కర్ మోశాడు

భారత రాజ్యంగం అమలులోకి వచ్చిన శుభదినం భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైన సుదినం..
75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు. ఆగస్టులో ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ 208 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు వేరే పరిషత్ ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం జూన్ 3న స్థాపించారు. అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ లో 299 స్థానాలు ఉన్నాయి.

భారతీయునిగా పుట్టినందుకు గర్వించు… దేశాన్ని ప్రేమించు…

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం మొదటిది. దీంతో మన రాజ్యాంగానికి ఉన్న ఖ్యాతి అలాంటిది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవంగా పిలుచుకునే నేటి రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మన రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది. ఆంగ్ల భాషలో ఉన్న భారత రాజ్యాంగం మొత్తం 117,369 పదాలతో, అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలుగా ఉంది. మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు చేశారు. రాజ్యాంగం రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ సభ్యులు 1950 జనవరి 24న డాక్యుమెంట్ల పై సంతకం చేశారు. అసలు మన రాజ్యాంగం 1949 డిసెంబర్ 26నే తయారయినా దాని అమలుకు మాత్రం సమయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో జనవరి 26న దాని అమలు చేసి దానికి శ్రీకారం చుట్టిన సంగతి విధితమే. ప్రస్తుతం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

భారతదేశం అనేక కులాలు, మతాలు, తెగలు, భాషలు, జాతులు మొదలైన వైవిధ్యభరితమైన దేశం. భారత రాజ్యాంగ నిర్మాతలకు ఇది తెలుసు, అందుకే సుమారు 3 సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత అన్ని విభిన్న అవసరాలకు అనుగుణంగా అనువైన రాజ్యాంగం వచ్చింది,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గారి కృషి…

ప్రపంచ దేశాల రాజ్యాంగంలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ల, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉండే వాటిని మాత్రమే తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరచినారు…
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. బాబా సాహెబ్ అంబేద్కర్, స్వాతంత్ర్యం వచ్చిన 9 సంవత్సరాల తరువాత మాత్రమే జీవించి ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారు, స్వాతంత్ర్య పోరాటంలో పూనా ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ఆయన చేసిన కృషి కంటే ఇది గొప్పది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంకే గాంధీ దళితులకు రిజర్వ్‌డ్ సీట్లు ఇచ్చారు. హిందూ సమాజం యొక్క అసహ్యకరమైన కుల వ్యవస్థ ద్వారా శతాబ్దాలుగా అణచివేయబడిన సమాజానికి అతనికి మరియు గాంధీకి మధ్య రాజీ ఒక కొత్త జీవితానికి నాంది మాత్రమే.
రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ “రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు”. అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

భారత రాజ్యాంగాన్ని “అరువు తెచ్చుకున్న సంచిగా” అనేక మంది భావిస్తారు ఈ అతిపెద్ద రాజ్యాంగంలోని అనేక అంశాలను అనేక దేశాల నుంచి పరిశీలించి మన పరిస్థితులకు అనుగుణంగా ఉన్నవాటిని తీసుకోవడం ద్వారా కొందరు ఆ పేరుతో పిలుస్తుంటారు, కానీ ఒక సుదీర్ఘమైన రాజ్యాంగం మనది. భారత రాజ్యాంగం రూపొందించినప్పటి నుంచి అనేక పరీక్షలకి మార్పులకి లోనయింది 1950లో రాజ్యాంగాన్ని అమలు చేసిన అప్పటి నుంచి 368 అదికరణ ద్వార అనేక సార్లు సవరించారు..
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ “భారతదేశం – ప్రజాస్వామ్య తల్లి” మరియు “విక్షిత్ భారత్”, ఇది ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం యొక్క పాత్రను మరియు దాని పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నిజమైన సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ…
దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాజుల దినేష్.
సామాజిక విశ్లేషకులు..
ఎంఏ. ఏంఎడ్‌, సెట్, పిజిడిసిఎ.
పొలిటికల్ సైన్స్ లెక్చరర్.
9666238266

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News