Saturday, November 23, 2024
HomeతెలంగాణRekurthi: రేకుర్తిలో అక్రమ కట్టడాలపై ప్రజాదర్బార్ లో ఫిర్యాదు

Rekurthi: రేకుర్తిలో అక్రమ కట్టడాలపై ప్రజాదర్బార్ లో ఫిర్యాదు

కుమ్మక్కైన తీరుపై వివరంగా కంప్లైంట్

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ ఎస్సారెస్పీ కెనాల్ D94 కు ఆనుకొని రేకుర్తి అంటేడ్కర్ స్టాచ్ పక్కున సర్వేనెంబర్ 52 ఎస్సారెస్పీ స్థలంలో అక్రమ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారిపై తగుచర్యలు తీసుకోవాలని కోరుతూ దుర్గం మనోహర్ హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

18 వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి భర్త కృష్ణ కుమార్ గౌడ్ అండదండలతో ఎస్సారెస్పీ కెనాల్ స్థలంలో రేకుర్తికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి టీచర్ ఎనగందుల రవీందర్ గౌడ్ దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని, రవీందర్ గౌడ్ తో పాటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఆకారపు నవీన్, రేకుర్తి విద్యుత్తు లైన్మెన్ ఆరేపల్లి శామయ్య అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్రమ ఇంటి నిర్మాణాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో ఈ నెల 19న కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పటి కొత్తపల్లి తాసిల్దార్ చిల్ల శ్రీనివాస్ తో కుమ్మకై రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ గుట్ట ప్రభుత్వ భూమి అయిన 55 సర్వేనెంబర్ లో దొంగ ఇంటి పన్ను రసీదులు ఇస్తూ అక్రమ ఇంటి నిర్మాణాలకు పాల్పడ్డారని ఈ అక్రమ కట్టడాలపై తెరవెనుక ఉండి నడిపించేది 18వ డివిజన్ కార్పొరేటర్ సుధ గోని మాధవి భర్త కృష్ణ గౌడ్ అని అక్రమ కట్టడాలపై ప్రత్యేక అధికారిని నియమించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఫిర్యాదులో ముఖ్యమంత్రి ని కోరినట్లు మనోహర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News