Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR fire on Cong-BJP: కాంగ్రెస్ - బిజెపిది ఫెవికాల్ బంధం

KTR fire on Cong-BJP: కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం

కాంగ్రెస్ అహంకారం వల్లే విక్షాలు కూటమి వీడుతున్నాయి

కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధమంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు..

- Advertisement -

కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది

కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లే

కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని తిట్టి…. అధికారంలోకి రాగానే దావోస్లో వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బిజెపి కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేలా పనిచేసింది

బిజెపి ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజకీయ నేపథ్యం అని మన పార్టీ అభ్యర్థులను తిరస్కరించింది… కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం ను మాత్రం నా మినిట్ చేసింది

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రా అని తిరుగుతుంటే… కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ చొడో అని వదిలి వెళుతున్నాయి

కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ని వదిలి వెళుతున్నాయి

ఆ కూటమిలో మిగిలేది చివరికి రాహుల్ గాంధీ ఒక్కరే

ఢిల్లీలో మోడీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదు.

బిజెపిని ఎదుర్కొనే శక్తి లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే చేతులెత్తేసింది

పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్ లోనితీష్ కుమార్, పంజాబ్లో ఆమ్ ఆర్మీ పార్టీ మాదిరే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలి

మోడీ అపేది ముమ్మాటికీ బలంగా ఉన్న ప్రాంతీయ లీడర్లే అనే విషయం గుర్తుంచుకోవాలి

బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, వంటి బిజెపి లీడర్లను ఓడించింది కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్ అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి

తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపించ గలిగేది గులాబీ పార్టీ మాత్రమే

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ వంటి పార్టీలకు వేయాలి

మోసం కాంగ్రెస్ నైజం… హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు

ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న ఒడ్డుకెక్కినంక బోడ మల్లన్న ఇదే కాంగ్రెస్ పార్టీ నైజం

రాష్ట్రంలో ఉన్న కోటిన్నర మంది అర్హులైన మహిళలకు రెండున్నర వేల రూపాయల మహాలక్ష్మిని పార్లమెంటు ఎన్నికలకు ముందే అందించాలి

మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వివరాలు తీసుకొని సంక్షేమ పథకాలు అందించాం

కానీ కేవలం ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళానికి గురి చేశారు

పరిపాలనపరమైన కారణాలు చెప్పి హామీలను ఎత్తగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది

వచ్చేనెల బిల్లు కట్టవద్దు సోనియా కడుతుందని రేవంత్ చెప్పిండు

మరి సోనియాగాంధీ ఈనెల బిల్లు కట్టిందా…

కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది

కిషన్ రెడ్డికి మరోసారి ఒటు అడిగే హక్కు లేదు- కెటిఅర్

అంబర్పేట్ లో ఓడిపోయిన సానుభూతితో గత పార్లమెంట ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచిండు

ఐదు సంవత్సరాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమిటో ప్రజలకు వివరించి ఈసారి ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్

కేంద్ర ప్రభుత్వం మంత్రిగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏదైనా ఒక్కటి తెలంగాణకు ఇచ్చిండా

హైదరాబాదులో అతిపెద్ద గుడి కట్టింది పీజేఆర్ కుటుంబం… ఆయన కుమారుడు మన పార్టీలో ఉన్న ఏ రోజు దాని వాడుకోలేదు

రామ మందిరం కట్టడం మంచిదే కానీ రాజకీయంగా పరిపాలన పరంగా బిజెపి ఏం చేసిందో చెప్పాలి

మోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి

మోడీ ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి

భారతదేశంలో అత్యంత అట్టర్ ప్లాప్ కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కిషన్ రెడ్డినే

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హైదరాబాదులో మల్ల ఎగిరేది గులాబీ జెండానే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News