Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్Allagadda: షర్మిలకు ఘన స్వాగతం

Allagadda: షర్మిలకు ఘన స్వాగతం

కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఖాయం

కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కడపలో కార్యకర్తల సమావేశం ముగించుకుని నంద్యాల పార్లమెంటరీ కర్నూలు పార్లమెంటరీ సమావేశాలకు వెళుతున్న సందర్భంగా ఆళ్లగడ్డలో స్థానిక నాయకులు బరగోడ్ల హుస్సేన్ భాష ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అధ్యక్షులు జంగిటి లక్ష్మీనరసింహ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంషులహక్, కాంగ్రెస్ కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా నంద్యాల కర్నూలు జిల్లాల కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్న సందర్భంగా ఆళ్లగడ్డలో ఘన స్వాగతం పలకారు.

- Advertisement -

షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం వస్తుందని, జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ ఆస్తులకు, కుటుంబానికి మాత్రమే వారసుడని, రాజకీయంగా నిజమైన వారసురాలు షర్మిలనే అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని వారు అన్నారు. షర్మిల వెంట నడిచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య గంధం మల్లేశ్వర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్ దస్తగిరి, నజీర్, నరసింహ, శ్రీనివాస్ యాదవ్, మహబూబ్ బాషా ఇలియాస్ సంజీవ మహబూబ్ బాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News