Saturday, November 23, 2024
HomeతెలంగాణThalakondapalli: అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సర్పంచ్ బక్కి కుమార్

Thalakondapalli: అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సర్పంచ్ బక్కి కుమార్

ఉత్తమ గ్రామ పంచాయతీ, దీన్ దయాళ్ జాతీయ అవార్డు పొందాం..

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిధిలోని చంద్రదన గ్రామ పంచాయతీలో గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను చంద్రధన గ్రామ సర్పంచ్ బక్కి కుమార్ ఆధ్వర్యంలో ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్కి కుమార్ కుటుంబ సభ్యులు వారి తల్లి బక్కి వెంకటమ్మ కుటుంబ సభ్యులతో కలసి గ్రామ ముఖద్వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్వతాలు, యాదగిరి, వెంకటేశ్ సత్యయ్య, లక్ష్మమ్మ, పద్మ మహేశ్వరి, విజయ లక్ష్మి, శ్రీలత, ఉపసర్పంచ్ సుధాకర్ వార్డ్ సభ్యులు, కృష్ణా వేణి యాదగిరి, రాణి రాజు యాదవ్, రేణుక యాదయ్యా, మధు రెడ్డి, సునీత, శాంతయ్య మరియు గ్రామ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులతో కలసి గ్రామంలో చేపట్టిన గ్రామ పంచాయతీ ముఖ ద్వారంను గ్రామ సర్పంచ్ బక్కి కుమార్ తన స్వంత నిధులతో వారి తాత బక్కి బాలయ్య వారి తండ్రి బక్కి చెన్నయ్యా జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీ ముఖ ద్వారం ప్రారంభించారు. అదేవిధంగా గ్రామ హైమర్ట్ 5 లక్షల యాబై వేల రూపాయలతో, పల్లె పకృతి వనం నర్సరీ, వాటర్ ఫిల్టర్ మరియు వివిధ అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ బక్కి కుమార్, ఉప సర్పంచ్ సుధాకర్ సెకారేటర్ ప్రవీణ్ వార్డ్ సభ్యులు గాసుమారు కోటి రూపాయల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ సర్పంచ్ బక్కి కుమార్ తో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమం ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సహకారంతో వార్డు సభ్యుల సహకారంతో కేంద్ర ప్రభుత్వ భారత ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసామని చెప్పారు. స్థానికంగా ఉన్న గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పిటిసి సహకరించకున్నా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపినట్టు గ్రామ సర్పంచ్ కుమార్ స్థానిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రజలనుద్దేశించి చెప్పారు. ఈ ఐదేళ్ల పదవీ కాలంలో అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధితో పాటు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, దీన్ దయాల్ జాతీయ అవార్డు పంచాయితీ పురస్కారం అందుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News