Thursday, September 19, 2024
HomeతెలంగాణLB Nagar: బైరామల్ గూడ చెరువును సందర్శించిన ఎమ్ ఎల్ ఏ సుధీర్ రెడ్డి

LB Nagar: బైరామల్ గూడ చెరువును సందర్శించిన ఎమ్ ఎల్ ఏ సుధీర్ రెడ్డి

చెరువులోకి యూ.జీ.డి.నీరు రాకుండా చర్యలు తీసుకోమంటూ ఆదేశాలు

ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పలువురు కాలనీ వాసులు, అధికారులచే కలిసి బైరామల్ గూడ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బైరామల్ గూడ చెరువు వద్ద చెరువులోకి యూ.జీ.డి.నీరు రావొద్దు అని ఒక ప్రత్యేకమైన లైన్ గత మూడు సంవత్సరాల క్రితం కృష్ణ నగర్ కాలనీ నుంచి బైరామల్ గూడ గ్రామం గుండా శుభం ప్యాలస్ మీదుగా సరూర్ నగర్ చెరువు వరకు నాలుగు ఫీట్ల యూ.జీ.డి.లైన్ వేయించడం, బైరామల్ గూడ చెరువు వద్ద చిన్న జంక్షన్ కట్టించామన్నారు.

- Advertisement -

జంక్షన్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల చెత్త, చెదారం పేరుకొనిపోయి డ్రైన్ నీరు చెరువులోకి వస్తోందన్నారు. దాంతో చెరువులో దుర్గంధపూరిత వాతావరణం ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో వీటి మీద సరైన దృష్టి పెట్టలేదన్నారు.

సాయి నగర్ కాలనీ కాకతీయ కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులకు ఈ సమస్యను ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి వివరించారు. దానిలో భాగంగా బైరామల్ గూడ చెరువు వద్ద ఉన్న జంక్షన్ లో ప్రతి రోజూ చెత్తను తీయడానికి ఒక మనిషిని విధిగా ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా చెరువులోకి సీవరేజ్ నీరు రాకుండా చర్యలు తీసుకోవచ్చు అని తెలిపారు. పక్కన నిర్మించిన యూ.జీ.డి.లైన్ నుంచి సీవరేజ్ నీరు పోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే ఇరిగేషన్ అధికారులచే మాట్లాడుతూ చెరువు వద్ద ఉన్న గేట్ ను సరిచూడాలని తెలిపారు. ఈ రెండు విషయాల మీద బాగా శ్రద్ధ పెట్టడం వల్ల మురికి నీరు బైరామల్ గూడ చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. త్వరలోనే చెరువు వాతావరణాన్ని మెరుగుపరుస్తామన్నారు. చెరువు ప్రధాన ద్వారం వద్ద చెత్త చెదారంతో నిండిపోయిందని, జెసిబితో క్లీన్ చేయించాలని అధికారులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమరెడ్డి, ఇరిగేషన్ డి.ఈ. పవన్, ఎల్.బి.నగర్ సర్కిల్ కమిషనర్ దశరథ, కోటేశ్వరరావు, వాటర్ వర్క్స్ అధికారులు, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, రాజీరెడ్డి, బొంబాయి, మల్లేష్ గౌడ్, ఉమ మహేశ్వర్, వెంకట్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News