కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల గ్రామాన్ని అభివృద్ధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలపడంలో అందరి కృషి ఉందని గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు పేర్కొన్నారు రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాలకవర్గ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది గత ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. వెలిచాల గ్రామాన్ని ఐదేళ్ల కాలంలో అందంగా తీర్చిదిద్దడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.
రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 70 ఏళ్ల అభివృద్ధిని కేవలం గత 10 ఏళ్ల లోనే చేసి చూపించామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో నాలుగు కోట్ల 81 లక్షల వినియోగించడమే కాకుండా సొంత ఖర్చులు కూడా వెచ్చించామన్నారు.
ప్రజలు సహకరిస్తే రానున్న రోజుల్లో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కరరావు ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి ఉపసర్పంచ్ పూదరి వెంకటేష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.