Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Dhani from Adoni: ఆ 'ధని' కి ఆదోని టికెట్ దక్కేనా?

Dhani from Adoni: ఆ ‘ధని’ కి ఆదోని టికెట్ దక్కేనా?

మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి

పెద్ద కుటుంబ నేపథ్యం..ఉన్నత కుటుంబం కావడంతో ఆ ఊరిలో ఆ కుటుంబానికి ‘ధని ‘ అనే పిలుపు. ఉన్నత చదువులు చదవాలని ఆశ. చదువు మధ్యలోనే ఫ్యాక్షన్ కు బలైంది కుటుంబం. కుటుంబానికి అండగా ఉండడానికి చదువు మధ్యలో మానేసి ఇంటికి వచ్చాడు. కుటుంబ ఆలోచనలు ఒకటి అయితే, యవ్వన దశ నుండే అందరి చేత ధని అనే పిలుపుతో కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటు అందించడం, తన అన్న చిరంజీవి ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అదే బాటలో మెగా ఫ్యామిలీకి వీరాభిమానుడిగా ఉంటూ పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. చిరంజీవి పిలుపునందుకొని బ్లడ్ క్యాంప్ లు నిర్వహించడం, అపదలో ఉన్న గర్భిణీలకు రక్తదానం చేయడం, తన గుమ్మం దగ్గరికి వచ్చి కష్టాలు చెబితే తక్షణ సహాయం చేయడంతో పట్టణంలో మల్లప్ప పేరు తెలియని వారుండరు.

- Advertisement -

2008 లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడం, మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి అభిమానం కావడంతో ప్రజారాజ్యంలో చేరారు. ఉమ్మడి జిల్లాలోనూ ప్రజారాజ్యంను బలోపేతం చేశారు. మల్లప్ప ప్రతిభను గుర్తించి అప్పటి యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో చివరి నిమిషంలో ఒకరు కుతంత్రం పన్నడం వలనే సీట్ ఉమ్మి సలీంకు కేటాయించారు. తన బ్లడ్ లో మెగా ఫ్యామిలీ ఉండడంతో సీట్ ఇతరులకు కేటాయించినా నిరాశ చెందకుండా చిరంజీవి ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో ఉమ్మి సలీం విజయానికి ప్రచారంలో పాల్గొన్నారు. తదనంతరం జరిగిన పరిణామాలతో ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేయడం, సమైక్యాంధ్ర ఉద్యమంతో కాంగ్రెస్ నుండి సైలెంట్ గా ఉండిపోయారు. తాను పదవులు ఆశించకుండా, స్వంత నిధులతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 2013 లో జనసేన పార్టీ స్థాపించడంతో ఆయన అడుగుజాడల్లో నడిచాడు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగు దేశానికి మద్దతు ప్రకటించడంతో మల్లప్ప కూడా అదే బాటలో నడిచి టిడిపికి మద్దతు ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి దాదాపు 12 వేల ఓట్లు సాధించి జిల్లాలో తన మార్క్ ను చూపించాడు. ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్నది, అలాంటిది పవన్ కళ్యాణ్ పిలుపుతో ఒక్క రూపాయ పంచకుండా 12 వేల ఓట్లు సాధించి ప్రత్యర్థులకు హడలు పుట్టించాడు. ఎన్నికల్లో ఓటమి చెందినా నిరాశ చెందకుండా జనసేన పార్టీనే నమ్ముకొని బలోపేతానికి కృషి చేశాడు. ఇరవై ఐదు ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ మరో ప్రక్క సేవా రంగంలో ఆదోని ప్రజల మన్ననలు పొందుతూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లలో మంచి గుర్తింపు ఉంది.
2024 ఎన్నికల్లో తానే జనసేన పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్దం అవుతున్న వేళ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించడంతో అయోమయంలో పడ్డారు. అయినా మొక్కోవనీ దీక్షతో విశ్వ ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయినట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రముఖులను కలవడం, వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ప్రజలలో ఆదోని సీట్ జనసేనకు కేటాయించారని గుసగుసలాడుకుంటున్నారు. ఆదోనిలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందులో భాగంగా పొత్తులో జనసేనకు కేటాయిస్తారు అనే వాదన బలంగా ఉంది. ఇదే నిజమైతే తెలుగు దేశం, బీజేపీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, మదిరే భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, విట్టా రమేష్, కునిగిరి నీలకంఠ, ఉమ్మి సలీం, సౌదీ రఫ్, రామచంద్ర, శ్రీకాంత్ రెడ్డి, నూర్ అహమ్మద్ లతో సత్సంబంధాలు ఉండడంతో ఆదోని గడ్డపై జనసేన జెండా ఎగరవేయవచ్చుననే ధీమాలో ఉన్నట్లు సమాచారం. ఆదోని టికెట్ ఎవరికి వచ్చిన కలసికట్టుగా ఉండి గెలుపుకు కృషి చేయాలన్నదే అందరి అశయం, అప్పటి వరకు ఎవరి ప్రయత్నాలు వారివే అన్నదే కొసమెరుపు. రాజకీయాల్లో ప్రధానంగా కలసి వచ్చే అంశం సానుభూతి, అది మల్లప్ప పట్ల నియోజకవర్గ ప్రజల్లో మెండుగా ఉన్నట్లు కనబడుతుంది. మరి పొత్తులో భాగంగా రాయలసీమలో జనసేన ప్రభావం అంతంత మాత్రమే కావడంతో బలంగా ఉన్న ఆదోనికి జనసేన టికెట్ కేటాయిస్తారో లేక ధనికి మొండి చెయ్యి చూపిస్తారో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News