నంద్యాల సౌజన్య ఫంక్షన్ హాల్లో ఘనంగా నంద్యాల ఆర్య వైశ్య సంఘం ప్రథమ ప్రమాణ స్వీకారం మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్ ఆధ్వర్యంలో సాగింది. నూతన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడుగా బవనాసి నాగమహేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పేద ఆర్యవైశ్యులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ తమకు నచ్చిన నాయకులకు ఓటు వేయాలని అన్నారు.
ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మాజీ రాజ్యసభ సభ్యుడు టిజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచంలో సనాతన ధర్మం పాటిస్తూ, తమ ఉనికిని చాటుతుంది వైశ్యులు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ కు ఇస్తాం అన్న నిధులు ఇప్పటికైన చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయిస్తే వైశ్యులు కొంత మంది అయిన మీపై ప్రేమ చూపిస్తారని పేర్కొన్నారు.
ఆర్య వైశ్యులపై దాడులకు ఎవరైన పాల్పడితే తన సర్వశక్తులు కృషిచేసి వారికి అండగా నిలబడతానని తెలిపారు. సంఘంలో ఎన్నికైన ప్రతి సభ్యునికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలియ చేసారు. ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఒక తాటిపై కలిసి మన హక్కుల కోసం పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు కార్యదర్శులు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.