మేడారం వచ్చే భక్తులకు అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ములుగు, అటవీ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టడానిగాను, వన్యప్రాణుల సంరక్షణ కోసం నామమాత్రంగా వసూలు చేస్తున్న రుసుమును ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ నెల 2 నుండి 29 వరకు పర్యావరణ రుసుము వసూలు చేయడం నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతరకు వచ్చే వాహనాలు రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంటుందని, వివిధ వర్గాల నుండి వచ్చిన విజ్జప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకన్నట్టు ఆమె వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని మంత్రి సురేఖ కోరారు.
Medaram: మేడారం భక్తులకు ఫారెస్ట్ ఎంట్రీ ఫీజు లేదు
ఈ నెల 2 నుండి 29 వరకు ..