భూకబ్జాకు పాల్పడిన 21వ డివిజన్ (సీతారాంపూర్ ) కార్పొరేటర్ జంగిలి సాగర్ అరెస్ట్ కాబడి, సంబంధిత కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విదించినందున, ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నాడు. అంతేకాకుండా వరుస నేరాలకు పాల్పడుతూ అక్రమంగా ప్రజలని బెదిరింపులకు గురిచేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నందున రెండు రోజుల క్రితమే అతనిపై కొత్తపల్లి ఎస్సై అభ్యర్థన మేరకు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు రౌడీషీట్ ని కూడా తెరిచిన విషయం విదితమే. ఇదిలా ఉండగా తదుపరి విచారణ కోసమై కరీంనగర్ రూరల్ పోలీసులు జైలు నుండి గురువారం ఉదయం 10 గంటల నుండి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు 24 గంటల పోలీసు కస్టడీలోకి తీసుకున్నారని తెలిసింది. ఈ విచారణలో భాగంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్న జంగిలి సాగర్ పై నమోదు చేసిన కేసులకు సంబందించిన మరింత విలువైన సమాచారం సేకరించేందుకు కరీంనగర్ లోని సీతారాంపూర్ లో గల అతని ఇంటిలో కరీంనగర్ రూరల్ పోలీసులు సోదాలు నిర్వహించి, పలు కీలక డాకుమెంట్స్ ని సీజ్ చేసారని సమాచారం.