అనతి కాలంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన తెలుగుప్రభ దినపత్రిక ప్రజలను చైతన్య పరచడంలో ముందు వరుసలో ఉంటుందని జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ అన్నారు. తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యం రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొనగంటి సంపత్ మాట్లాడుతూ… తెలుగుప్రభ దినపత్రిక నిజాలను నిర్భయంగా ప్రచురించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజలను చైతన్య పరచడంలో పత్రికల మధ్య పోటీతత్వం కలిగి ఉండాలన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యాన్ని, రిపోర్టర్ల బృందాన్ని అభినందించారు. జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సిని శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో స్నేహపూర్వక పోటీతత్వం కలిగి ఉండాలని అన్నారు. ప్రజా సమస్యలను తమ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్న తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి రామ్మూర్తి, ఏబూసి శ్రీనివాస్, పొనగంటి రాము, తెలుగుప్రభ దినపత్రిక హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండపాక అశోక్ గౌడ్, జమ్మికుంట రిపోర్టర్ మూల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.