Friday, November 22, 2024
Homeపాలిటిక్స్KTR: బిజెపిని ఆపగలిగే శక్తి ప్రాంతీయ రాజకీయ శక్తులకే

KTR: బిజెపిని ఆపగలిగే శక్తి ప్రాంతీయ రాజకీయ శక్తులకే

బిజెపికి కాంగ్రెస్ ఏ మాత్రము ప్రత్యామ్నాయం కాదు

కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు కేటీఆర్. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బిజెపితో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందన్నారు.

- Advertisement -

దీంతో బిజెపికి లాభం చేకూరుతుంది, ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, నిజానికి బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రి వాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బిజెపిని అడ్డుకోగలరని, బిజెపికి కాంగ్రెస్ ఏ మాత్రము ప్రత్యామ్నాయము కాదన్నారు కేటీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News