Friday, November 22, 2024
Homeహెల్త్Millets a super hero: చిరుధాన్యాల్లో ఫ్యాట్ 'చిరు'నే

Millets a super hero: చిరుధాన్యాల్లో ఫ్యాట్ ‘చిరు’నే

పోషకాలన్నీ ఉన్న సంపూర్ణ ఆహారం

మిల్లెట్స్ ఇపుడు చాలామంది ఫేవరేట్ ఫుడ్ అయిపోయింది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ చిరుధాన్యాల (మిల్లెట్స్)గురించి చాలామందిలో ఆసక్తి కూడా బాగా పెరుగుతోంది. చిరుధాన్యాలు చిన్న చిన్న గింజల రూపంలో ఉంటాయి. వీటిల్లో ఏడురకాల చిరుధాన్యాలను తప్పనిసరిగా మీ డైట్ లో చేర్చాలంటున్నారు డైటీషియన్లు కూడా. మనకు ఈమధ్యన తెలిసిన ఈ చిరుధాన్యాల సాగు వేల సంవత్సరాల నాటిది. పైగా వీటి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ కూడా పోషకాలనిధులు. వీటిల్లో కాలరీలు తక్కువ, పీచుపదార్థాలు ఎక్కువ. పైగా ఇవి బరువు తగ్గించడంలో సైతం ఎంతో సహాయకారులు. జీర్ణశక్తిని నియంత్రించడమే కాకుండా జీవక్రియ బాగా పనిచేసేలా చేస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం వల్ల మీరు పొందే ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం.

- Advertisement -

మీ భోజనంలో వీటితో రకరకాల వెరైటీలను చేసుకుని తినొచ్చు కూడా. చిరు ధాన్యాలలో సజ్జలది ప్రత్యేక స్థానం. దీన్ని హిందీలో బజ్రా అంటారు. వీటిల్లో ప్రొటీన్, ఫాస్ఫరస్, పీచుపదార్థాలు, మెగ్నీషియం, ఐరన్ బాగా ఉన్నాయి. వీటివల్ల జీర్ణశక్తి బాగా పనిచేయడంతో పాటు మలబద్దకం కూడా తగ్గుతుందంటున్నారు పోషకాహారనిపుణులు. అంతేకాదు ఇవి మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు బరువును కూడా తగ్గిస్తాయంటున్నారు. రాగులు కూడా చిరుధాన్యాలే. వీటిల్లో ఆరోగ్యకరమైన పిండిపదార్థాలతో పాటు పీచు పదార్థాలు కూడా బాగా ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ప్రమాణాలను సరిగా ఉంచుతాయి.

రాగుల్లో అమినో యాసిడ్స్, కాల్షియం, విటమిన్ డిలు పుష్కలంగా ఉన్నాయి. శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఎముకలు దృఢంగా ఉండేలా ఇవి చేస్తాయి. కొర్రలు మరో రకమైన చిరుధాన్యాలు. వీటిని హిందీలో కాంగ్నిఅంటారు. వీటిల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన
మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫ్యాట్ మాత్రం వీటిల్లో అస్సలు ఉండదు. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ప్రమాణాలను శక్తివంతంగా నియంత్రించడంతో పాటు శరీరం దృడంగా గట్టి రోగనిరోధకశక్తి కలిగి ఉండేలా చేస్తాయి. చిరుధాన్యాల్లో వరిగలు కూడా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వీటిని హిందిలో బరి అంటారు. వీటిల్లో తక్కువ ఫ్యాట్ ఉండి కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి6 కూడా వీటిల్లో ఎక్కువే.


కొలస్ట్రాల్ ని ఇవి బాగా తగ్గిస్తాయి. ఆహారం తొందరగా జీర్ణమయ్యేట్టు చేస్తాయి. ఊదలు మరోరకం చిరుధాన్యాలు. వీటిల్లో బాగా జీర్ణమయ్యే ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మిగతా చిరుధాన్యాల్లో కన్నా వీటిల్లో కాలరీల సాంద్రత కూడా చాలా తక్కువ. ఇవి గ్లూటెన్ ఫ్రీ. ముఖ్యంగా గ్లూటన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగం. కుట్కీ లేదా సామలు కూడా చిరుధాన్యాలే. వీటిల్లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. అలాగే డైటరీ పీచుపదార్థాలతో పాటు లో గ్లైసిమిక్ ఇండెక్స్ వీటి ప్రత్యేకత. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. బరువును, బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. కోద్రా లేదా అరికెలు చిరుధాన్యాలే. వీటిల్లో యాంటాక్సిడెంట్లతో పాటు యాంటి ఇన్ఫ్లమేటర్ పదార్థాలు బాగా ఉన్నాయి.వీటిల్లో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి జీర్ణం బాగా అయ్యేట్టు సహాయపడతాయి. బరువు తగ్గించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News