Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan 'Sidham': వైఎస్ జగన్ 'సిద్ధం'

YS Jagan ‘Sidham’: వైఎస్ జగన్ ‘సిద్ధం’

ఏపీలో తారాస్థాయికి చేరుకున్న రాజకీయ వేడి

మరోక చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?
ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమేనా?
పేదల భవిష్యత్‌ని, పేదలని కాటేసే ఎల్లో వైరస్‌ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతిసోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వా, తాతా మీరంతా సిద్ధమేనా?

- Advertisement -

మన రాష్ట్రంలో మన కర్మ ఏమిటంటే.. రామాయణం, మహాభారతం..ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా…ఓ చంద్రబాబు రూపేణా, ఈనాడు రూపేణా, ఆంధ్రజ్యోతి రూపేనా, టీవీ5 రూపేణా, దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవర్టులు.. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్‌ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్నది అసలు సీన్‌..
కానీ వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. జగన్‌ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్లవైపు నుంచి చూసినప్పుడు ఇంత మంది తోడేళ్ల మధ్యన జగన్‌ ఒంటరి వాడిలానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటంటే… ఇక్కడ కనిపిస్తున్నది నిజం. ఇది అసలు సీన్‌. ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్‌కు మీరు స్ధానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉండడం ఇదీ నిజం.

జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు, వారి ఎల్లో పత్రికలు, టీవీలు అయితే.. నాకున్న తోడు ఏమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న ఆ దేవుడు.. నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాకున్న బలం. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం మీద నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే ఏ రకంగా వాళ్ల స్పందన, ప్రేమ ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం.

మీరు కృష్ణుడు- మీ అర్జునుడు జగన్‌
జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్టుడి పాత్ర పోషిస్తూ… మీరు, మీకు తోడు అర్జునుడిని నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా.. కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే.. మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీద. ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి.. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేద వాడి భవిష్యత్, పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామాన అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు దాడి చేస్తున్నారు.

ఈరోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు, నాడునేడుతో మారుస్తున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది.

ఆలోచన చేయండి. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాడటానికి మళ్లీ మన వైయస్సార్సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా సిద్ధమేనా ? అని మరొక్కసారి అడుగుతున్నాను .

గోదారమ్మ సీమలో నిలబడి..
మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలో మనం తెచ్చిన మార్పు, ఆ ప్రతి గ్రామంలోనూ లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ. చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్‌ అడ్రస్‌ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కూడా కాలర్‌ ఎగరేసి చెప్పడానికి, కావాల్సినన్ని అన్ని అంశాలనూ పంచుకొనేందుకు.. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నాను.

నా మాటలు అన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. 14 ఏళ్లు సీఎం బాబు ఏం చేశాడని ప్రతి ఇంటిని అడగండి. మీ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో అడగండి.. అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడగండి. 1995లో సీఎం అయి, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు.. మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్‌ కు గానీ ఏం చేశాడు? అని అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. ఆ పదేళ్లు అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్‌ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందన్నది వారినే చూడమని అడగండి.

10శాతం హామీలను కూడా నెరవేర్చని బాబు..
చంద్రబాబు పాలనలో ఆ పేద కుటుంబానికి బ్యాంకు అకౌంటుకు ఇచ్చింది ఎంత అని ఆ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములును అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు హయాంలో ఏమున్నాయి అని అడగండి. తన పాలనలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి చంద్రబాబునాయుడు ఒక్క రూపాయి అయినా వేశాడా? అని అడగండి.

మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు… 1994లో గానీ, 1999లో గానీ, 2014లో గానీ టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడైనా 10 శాతం అయినా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలను అడగండి.

57 నెలల పాలనలో మీ బిడ్డ ఏం చేశాడంటే…
మరోవంక మీ జగన్‌ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని మళ్లీ అడగండి. ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను వివరిస్తా. ఈ తేడాను ప్రతి ఇంట్లో వివరించండి.
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి. ఏ పట్టణాన్ని తీసుకున్నా ఆ గ్రామానికి వెళ్లి నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది, మన గ్రామంలోనే ఈరోజు విలేజ్‌ సెక్రటేరియట్‌ కనిపిస్తుంది. ప్రతి పట్టణంలోనూ ఒక వార్డు సెక్రటేరియట్‌ కనిపిస్తుంది. ఎవరు పెట్టారంటే.. మీ జగన్‌. మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి వార్డు సచివాలయంలో కనీసం 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపు 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు.
మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే.. మీ జగన్‌. మన వైయస్సార్‌ సీపీ.

1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిలా, మనవరాలిలా, ప్రతి వితంతువుకి, వికలాంగుడికీ ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి చేతిలో పెడుతున్న 3 వేల పెన్షన్‌ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్‌. చేసినది మన వైయస్సార్సీపీ. లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు అప్పటి రోజులు. ఆరోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారంటే.. మీ జగన్‌. మన వైయస్సార్‌ సీపీ తెచ్చింది.
డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నది ఎవరు అంటే.. మీ జగన్, మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం.

ఈరోజు ప్రతి గ్రామంలో గవర్నమెంట్‌ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు–నేడు చేసినది, చేస్తున్నది ఎవరు అంటే.. మీ జగన్‌. మీవైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చేశాం.
గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.
గవర్నమెంట్‌ బడుల్లో పిల్లలకు బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్కులు, చిన్నారుల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయంటే… ఈరోజు డిజిటల్‌ బోధనతో ఆ క్లాస్‌ రూముల్లో ఐఎఫ్‌పీలు కనిపిస్తున్నాయంటే….ఆ బడులకు వెళ్లినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్‌. చేసినది మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అని చెప్పాడనికి గర్వపడుతున్నాను

రైతన్నను చేయిపట్టుకుని నడిపించేదీ…
రైతన్నను చేయిపట్టుకుని నడిపించేదీ మీ వైయస్సార్సీపీనే. ఇవాళ రాష్ట్రంలో రైతన్నను చేయిపట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకొచ్చింది ఎవరు అంటే మీ జగన్‌. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరంటే మీ జగన్‌.ఇది చేయడం ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన వైయస్సార్‌ సీపీ వచ్చిన తర్వాతే.

పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్‌ భూముల మీద 22ఏ భూముల మీద 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్‌. ఇది జరిగింది ఎప్పుడంటే వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన రూ.2.55 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి.. దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ది పట్ల, మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రేమ, అభిమానం, కమిట్‌ మెంట్‌ చూపింది ఎవరంటే మీ జగన్‌. ఈ మంచి జరిగింది ఎప్పుడంటే.. మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.

నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్‌. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
కేబినెట్‌లో 68 శాతం మంత్రి పదవులు నా… అంటూ నేను పిలుచుకొనే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు మీ బిడ్డ పాలనేలోనే దక్కింది.

నలుగురు డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్‌ పర్సన్‌ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా,కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నా అని పిలుచుకుంటూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది ఎప్పుడంటే మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే.

ఈ ప్రేమ ఉంది కాబట్టే..
రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇందులో 80 శాతం నేను నా… అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, వైయస్సార్‌ సీపీ పాలన వచ్చిన తర్వాతే.

అక్కచెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలి, వారికి గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నది ఎవరంటే మీ జగన్‌. మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
నా అక్కచెల్లెమ్మలు ప్రతి రంగంలో ముందడుగు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని, వారికి నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి ఇస్తున్నది ఎవరంటే మీ జగన్‌. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే.

అక్కచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని…
అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, దిశ యాప్‌ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్‌. ఇది జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ప్రతి గ్రామంలోనూ ఇవాళ ఒక మహిళా పోలీస్‌ కనిపిస్తుంది.

ప్రతి గ్రామంలోనూ ఇవాల ఒక విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్‌ వస్తున్నాడంటే దానికి కారణం, ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, నేరుగా ఇంటికొచ్చి వైద్యం చేసి, మందులిచ్చే పరిస్థితి ఉందంటే కారణం.. మీ బిడ్డ. జరుగుతున్నది మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.

ఆలోచన చేయండి. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలుతీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది, అవన్నీ మరింత మెరుగ్గా నాలుగు అడుగులు ముందుకు కదులుతున్నది, అమలు జరుగుతున్నది మీ బిడ్డ హయాంలో, వైయస్సార్‌ సీపీ పాలనలో.

కొత్తగా ఆసుపత్రులు, పోర్టులు, హార్భర్లు…
కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, కొత్త ఎయిర్‌ పోర్టులు వస్తున్నాయి. ఉన్నవి విస్తరణ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులుతో చేస్తున్నాం. పారిశ్రామిక వ్యక్తులు, సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. జరుగుతున్నది మీ బిడ్డ పాలనలో, మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవం అవునా? కాదా? అని ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ ఈ వాస్తవాలను తీసుకొని పోవాలి.

2019లో మనం అధికారంలోకి రాక ముందు.. ఏ ప్రభుత్వం అయినా ఇది సాధ్యపడుతుందా? అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగాం. గ్రామ స్వరాజ్యం తీసుకురాగలుగుతామా? లంచాలు, వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా? అని 2019 ముందు ఎవరైనా, ఎవరినైనా అడిగితే.. కుదరనే కుదరదు.ఎప్పుడూ జరగలేదు అనే మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈ రోజు అన్నీ జరుగుతున్నాయి.

అర్హతే ప్రామాణికంగా పథకాలు– జగనన్నకే సాధ్యం.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ కూడా ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే.. కాదు.. అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికే చూపించగలిగాం.

ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత– మీ బిడ్డ హయాంలోనే.
ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టో అని పెద్ద పెద్ద మాటలు చెబుతారు. మేనిఫెస్టోలు రిలీజ్‌ చేయడం, తర్వాత మోసం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం .. ఇది సాంప్రదాయంగా జరుగుతోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.
మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ చేశాం. మొదటిసారి మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసి ప్రతి ఒక్కరికీ చూపించి వాళ్ల ఆశీస్సులు తీసుకుంటున్న పార్టీ ఎక్కడన్నా ఉందంటే… అది మన వైయస్సార్‌ సీపీ పార్టీ మాత్రమే.

మరి ఇవన్నీ కనిపిస్తున్నా కూడా కళ్లుండి ఈర్ష్యతో చూడలేని కబోదులు… ఇటువంటి వారంతా ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా..
వాళ్లకు ఎక్కువ టీవీ చానళ్లు, పేపర్లు ఉన్నారు. మనల్ని తిట్టేవారి సంఖ్య కూడా ఎక్కువ ఉంది. వాళ్ల నోరుమంచిది కాదు. వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అబద్ధాల పునాదుల మీద వారి ఎన్నికల ప్రచారాల్ని మొదలు పెట్టారు.

రానున్నవి పేదల సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలు…
ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో, అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ఆ ప్రతి అవ్వాతాతకు, అక్కచెల్లెమ్మకు, అన్నదమ్ముడికి చెప్పాలి. ఇవి కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలు ఈ ఎన్నికలని ప్రతి ఇంట్లోనూ చెప్పండి.

ప్రతి కుటుంబం, ప్రతి సామాజికవర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, ప్రతి రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటిలో జరుగుతున్న అభివృద్ధి, పిల్లల భవిష్యత్‌ అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని ప్రతి ఒక్కరూ గమనించండి.

ఇప్పటికే మనం రూ. 3 వేలు చేసిన పెన్షన్, 1వ తేదీ ఉదయాన్నే ఈ రూ.3 వేల పెన్షన్‌ అందాలన్నా, భవిష్యత్‌ లో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్‌ రావాలన్నా.. మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి.

ప్రతి ఇంట్లోనుంచి స్టార్‌ క్యాంపెయినర్లు….
ఇదిజరగాలి అంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్‌ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పండి.
బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం వంద మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.
అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కొనాగాసాలన్నా, సున్నా వడ్డీ రావాలన్నా, ఆసరా తు.చ.తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

ఆ అక్కచెల్లెమ్మలే మన స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. కనీసం 100 మందికి అయినా చెప్పి ఓటు వేయించాలి, మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలని చెప్పండి.
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతోపాటు పేద అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేరాలన్నా, మహిళా సాధికారతకు ఏ మంచిజరగాలన్నా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. స్టార్‌ క్యాంపెయినర్లుగా మారాలని చెప్పండి.

మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకుందామని…
గవర్నమెంట్‌ బడులు మారాలన్నా, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలన్నా, ప్రతి క్లాస్‌ రూములో డిజిటల్‌ బోధనతో మొదలు,ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు రావాలన్నా, పెద్ద చదువులు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, అంతర్జాతీయ చదువులు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పండి.
పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, 100 మందికి చెప్పాలని, మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకూ చెప్పండి.

ప్రతీ రైతన్నా స్టార్‌ క్యాంపెయినరే…
గ్రామాల్లో ప్రతి రైతన్నకూ చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్‌ రావాలన్నా, సీజన్‌ ముగిసేలోపే ఆ రైతన్నకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని ప్రతి రైతన్నకూ వెళ్లి చెప్పండి. ప్రతి రైతన్న స్టార్‌ క్యాంపెయినర్‌ కావాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని అడగండి.

57నెలల్లో 124 సార్లు బటన్‌ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు జమ…
ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్‌ నొక్కాడు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లంచాలు లేవు, వివక్ష లేదు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లు పేద కుటుంబాలకు పంపింది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్‌ క్యాంపెయినర్లుగా మారాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని, గడపగడపకూ వెళ్లి కోరండి.

2024 ఎన్నికల్లో… జగనన్న కోసం ఒక్కసారి 2 బటన్లు నొక్కాలని చెప్పండి.
ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న 124 సార్లు మనకోసం బటన్‌ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి.. రెండు బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

జగనన్నకు ఓటు వేయకపోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం, ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
ఈరోజు నెల 1వ తేదీన పొద్దున్నే చిరునవ్వుతో ప్రతి అవ్వాతాత, ప్రతి అన్న తమ్ముడు, చెల్లెమ్మకూ ఇంటి వద్దకే వచ్చి సేవలు అందుతున్నాయి.
ప్రతిపక్షాలకు ఓటు– జన్మభూమి కమిటీలకు చోటు..
ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే దాని అర్థం మళ్లీ లంచాలు, మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్లీ బతికించినట్లవుతుందని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి.
మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అంటే జగనన్నను మర్చిపోకూడదు, 124 సార్లు బటన్‌ నొక్కాడు, ఆయన కోసం రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

ప్రతి ఇంటి వద్దకే పెన్షన్‌ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైయస్సార్‌ సీపీ కొనసాగాలి. ఈరోజు జగనన్న దేవుడిని, మనల్నే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు మీ జగనన్నకు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి.

చంద్రముఖి బెడద శాశ్వతంగా పోయేలా 2 బటన్లు ఫ్యాను మీద నొక్కండి…
ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్‌ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద.. ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్ర గ్రహణాలు ఉండవు.
లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుంది. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా మీ తలుపు తడుతుంది అని… గడపగడపలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి అక్కచెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకూ, అన్నదమ్ముడికీ చెప్పండి.

చెప్పుకునేందుకు చేసిందేమీ లేని వ్యక్తి బాబు…
14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చెప్పుకొనేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశా నాకు ఓటేయండి అని అడగాల్సిన వ్యక్తి.. చెప్పుకొనేందుకు ఏదీ లేదు కాబట్టి పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో సాగుతోంది.
ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి, ఎన్టీ రామారావు గుర్తుకొస్తున్నాడు. వెన్నుపోటు పొడిచేదీ ఆయనే, మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ ను గుర్తు తెచ్చుకొనేదీ ఆయనే.
ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటున్నారు.

ప్రజలను కాదు – పార్టీలను కదిలిరా అంటున్న బాబు…
ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తున్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని వాళ్ల వదినమ్మను పిలుస్తున్నాడు.

నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌…
రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైయస్సార్‌ గారి మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా చార్జ్‌ షీట్‌ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నువ్వు కూడా రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడు.
బాబుకు, దత్తపత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. ఈస్టేట్‌ కు, వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌.
వారికి ఏనాడైనా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే, ఆ ప్రజలతో పని పడినప్పుడే గుర్తుకొస్తారు.
ఆయన సైకిల్‌ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు.
చంద్రబాబుకు పొత్తే లేకపోతే కనీసం 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేసుకొనేందుకు అభ్యర్థులు కూడా లేరు.

ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్‌ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్‌ టార్గెట్‌గా, పేద వాడి సంక్షేమం టార్గెట్‌ గా వీరంతా వాళ్ల ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.

వీరందరితో యుద్ధానికి నేను సిద్ధం– మీరు సిద్ధమా ?
వీరితో యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అని అడుగుతున్నాను. ఈ యుద్ధం.. 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఇదీ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన.. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

ప్రజలు భుజాన మోసిన అజెండా మన జెండా…
ఆ కనిపిస్తున్న జెండాకు అర్థం.. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా సిద్ధమేనా? అని అడుగుతున్నాను.

ఇది మీ అందరి పార్టీ..
పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, ప్రతి వాలంటీర్‌ కి, ఒక్క విషయం చెబుతున్నాను.. వీరితోపాటు వార్డుమెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్ల వరకూ, మున్సిపల్‌ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్లు వరకూ, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైయస్సార్సీపీ ఇతర ప్రజా ప్రతినిధులకు ఒక్కటే చెబుతున్నాను. ఇది.. మీ అందరి పార్టీ.

జగన్‌ మీ బిడ్డ. మీ అందరికీ ఒక మంచి సేవకుడు. కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది.
నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం ఇవన్నీ కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.

గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే…
ఆ స్ధానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకొచ్చిన మనదైన వాలంటీర్‌ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతూ మనతోపాటు పని చేస్తున్నారు.

మన పార్టీని అభిమానించేవారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్‌ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు .. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు మొదలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభసభ్యులు, మంత్రిమండలి సభ్యులు వరకూ అన్నింటిలోనూ పార్టీ కోసం కష్టపడిన వారికి అంచలంచలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

మంచి పాలన అందించామని గర్వంగా చెప్పగలుగుతాం. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా గొప్ప పాలన ఇవ్వగలం అని చూపించాం. ప్రజలకు మంచి చేయగలిగాం.
ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతుంది. అందుకే భవిష్యత్‌ లో ఇంతకంటే గొప్పగా మన వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్‌ ఉన్న పార్టీ.

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం…
వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాదీ అని తెలియజేస్తున్నాను.

మన టార్గెట్‌ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు…
వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్‌. 25 ఎంపీలకు 25 ఎంపీలు మన టార్గెట్‌. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీలే లేదు అని తెలియజేస్తున్నాను. ఈ లక్ష్యాన్ని చేరుకొనేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..?
సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా సిద్ధమేనా..?

మన అస్త్రం– సెల్‌ఫోన్‌…
సమర భేరి ఖంగుమంది. ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్‌ ఫోన్‌. ఈ సెల్‌ ఫోన్‌ తో సోషల్‌ మీడియా పరంగా సిద్ధంగా ఉన్నారా అని అందరినీ అడుగుతున్నాను.

మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ముడు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి. సిద్ధమా?.. అని అడుగుతున్నాను.

చివరిగా…
దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News