ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పనిచేసే సాయుధ బలగాల పోలీసులకు నిర్వహించు అనువల్ మొబిలైజషన్ పది రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్మ్డ్ ఫోర్స్ కి సంబంధించి బేసిక్ ట్రైనింగ్ లో నేర్పించే అంశాలన్నిటిపైనా పరేడ్ , డ్రిల్ , ఆయుధాల వినియోగం , ఫైరింగ్ మొదలగు అంశాలన్నిటి పై తిరిగి అవగాహనా కల్పిస్తామన్నారు. మొబిలైజషన్ ముగింపు సందర్బంగా ఆరు ప్లాటూన్ లతో కూడిన పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్లాటూన్ కంమాండర్ గా రిజర్వు ఇన్స్పెక్టర్ మోడెమ్ సురేష్ వ్యవహరించి అద్భుతంగా పరేడ్ ప్రదర్శించారన్నారు. అన్నీ ఉద్యోగాల్లోకెల్లా పోలీస్ ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకున్నదని, దాన్ని నిర్వహించాలంటె ఫిసికల్ ఫిట్ నెస్ తో పాటుగా మానసికంగానూ ధృడంగా ఉండాలన్నారు. నిత్యం పని ఒత్తిడిలో వుండే సిబ్బందికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత ధృడంగా ఉండేలా ఎంతో దోహద పడతాయన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరచిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉత్తమ సేవలందించినందుకు గాను పలువురు పోలీస్ ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులు , సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సేవా పథకాలను ప్రకటించింది. జిల్లాలో 22 మందికి తెలంగాణ రాష్ట్ర సేవా పథకం, ముగ్గురికి గాను ఉత్క్రిష్ట సేవా పథకం, ఇద్దరికీ గాను అతి ఉత్క్రిష్ట సేవా పథకాలు ప్రకటించబడ్డాయి.కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఏఎస్సై సయ్యద్ అంజద్, కరీంనగర్ వన్ టౌన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ పి రవీందర్ లకు అతి ఉత్క్రిష్ట సేవా పథకాలు లభించగా, మానకొండూర్, కరీంనగర్ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు ఏ తిరుపతి , ఎన్ ప్రవీణ్ కుమార్ లకు ఉత్క్రిష్ట సేవ పథకాలు లభించగా , ఏఎస్సై లకు స్పెషల్ బ్రాంచ్ నందు పనిచేస్తున్న నూరుద్దీన్, ట్రాఫిక్ లో పని చేస్తున్న లక్ష్మా రెడ్డి , అబ్దుల్ రజాక్ , రామడుగు లో పనిచేస్తున్న గౌస్ ఖాన్, కరీంనగర్ రూరల్ లో పనిచేస్తున్న కిషన్, దామోదర్ రావు , కొత్తపల్లి లో పనిచేస్తున్న మల్లయ్య ,కరీంనగర్ టూ టౌన్ లో పనిచేస్తున్న గోపాల్ రెడ్డి , ఆర్మ్డ్ రెసెర్వ్డ్ లో పనిచేస్తున్న సయ్యద్ మొయినుద్దీన్, మల్లారెడ్డి , హెడ్ కానిస్టేబుళ్లు జమ్మికుంటలో పనిచేస్తున్న సారంగధర , రామడుగు లో పనిచేస్తున్న జీవన్ రెడ్డి , చిగురుమామిడి లో చేస్తున్న శ్రీనివాస్,తిరుపతి, కరీంనగర్ టూ టౌన్ లో చేస్తున్న సంపత్ , ఆర్మ్డ్ రిజర్వ్ లో పనిచేస్తున్న తిరుపతి , వీరాస్వామి, కొత్తపల్లి లో పనిచేస్తున్న శ్రీశైలం , ఇల్లందకుంట లో పనిచేస్తున్న శ్రీనివాస్ ఎల్ ఎం డి లో పనిచేస్తున్న లింగారెడ్డి , ఆర్మ్డ్ రిజర్వు లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చంద్రమౌళి లకు తెలంగాణ రాష్ట్ర సేవా పథకాలు లభించాయి. ఆయా పథకాలను ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీస్ చేతుల మీదుగా వారికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు సి రాజు (పరిపాలన) , లక్షినారాయణ (శాంతి భద్రతలు), ఏసీపీ లు నరేందర్ (టౌన్), కరుణాకర్ రావు (రూరల్ ), జీవన్ రెడ్డి (హుజురాబాద్), శ్రీనివాస్ (స్పెషల్ బ్రాంచ్), ప్రతాప్ (ఏ ఆర్), లతో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.