Sunday, September 22, 2024
Homeపాలిటిక్స్Dharmasagar: కాంగ్రెస్ లోకి రాజయ్య వద్దు

Dharmasagar: కాంగ్రెస్ లోకి రాజయ్య వద్దు

రాజయ్యను అడ్డుకుటాం

డాక్టర్ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే మేము ఊరుకోము దీనిని అడ్డుకుంటామని, రాజయ్యను ఏ మంత్రి అయితే ఆహ్వానిస్తున్నారో వారి ఇంటి ముందు ధర్నాకు దిగుతామని స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానంపై అగ్రహం వ్యక్తం చేశారు. ధర్మసాగర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలోని మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పటు చేసారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తే మేము ఊరుకోము, అతడు తన స్వలాభం కోసం పార్టీలోకి చేరుతున్నారని అతనిని పార్టీలోకి తీసుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు. అనంతరం ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపెళ్లి భిక్షపతి మాట్లాడుతూ…. 2009లో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిచి, టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు అతడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారని, అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించము. పార్టీలు మారడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు, నియోజకవర్గ ప్రజలను దళితులను మోసం చేశాడని అతని పార్టీలోకి చేరడానికి కారణం తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికేనని, ఆస్తులను కాపాడుకోవడానికేనని, పదవుల కోసం పార్టీలోకి వస్తున్నాడని, అతనిని పార్టీలోకి తీసుకుంటే అధిష్టానం తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు.
రాంపూర్ మాజీ ఎంపీటీసీ వేల్పుల రాజు మాట్లాడుతూ డాక్టర్ రాజయ్య పార్టీలోకి చేరడానికి కారణం అతను దళిత బంధుపై చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పార్టీలోకి రావాలనుకుంటున్నారని, చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుంటున్నారని, దీనిని అధిష్టానం గుర్తించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాజయ్య ఉపముఖ్యమంత్రి నుంచి తొలగించినప్పుడు, బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు చేరితే అతని విలువ ఉండేది, కానీ ఇప్పుడు చేరడానికి కారణం అతని రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికేనని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని అధిష్టానం ఆదేశించిందని, అధిష్టానం తీర్పుపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్యకర్తల నిర్ణయం తీసుకోకుండా రాజయ్యను పార్టీలోకి చేర్చుకుంటే మేము దీనిని తీవ్రస్థాయిలో ఖండిస్తామని అన్నారు. గతంలో రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసీ గెలిపిస్తే, అతనికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో నాకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో అతని ఎమ్మెల్యేగా గెలిపించిన కాంగ్రెస్ పార్టీని నట్టేటముంచి, కార్యకర్తలకు అబద్దాలు చెప్పి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికారం కోసం రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుంటున్నారు దానిని మేము సహించము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కార్యకర్తల నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తీవ్ర స్థాయిలో పార్టీ నాయకులమందరం అధిష్టానం తీర్పుపై వ్యతిరేకిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షుడు బొడ్డు లెనిన్, ఉనికిచర్ల గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్, మాజీ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News