తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్-15, అండర్-20 మెన్, వుమెన్ కుస్తీ పోటీలను వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్రెడ్డి ప్రారంభించారు. హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణా అమెచూర్ వ్రేజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్-15 అండర్-20 కుస్తీ పోటీలను మెన్ ఫ్రీ స్తైల్ గ్రీకో రోమన్, మహిళల కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ పోటీలు రెండు రోజులు సాగుతాయని, గెలుపు-ఓటమిలను సమానంగా తీసుకోవాలని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిగా ఆడాలని, విద్యార్థులు చదువులకే పరమితం కాకుండా వివిధ రంగాల్లో వారికి స్వేచ్చను కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అజీజ్ ఖాన్, వరద రాజేశ్వర్ రావు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మానస రాంప్రసాద్, బిన్నీ లక్ష్మణ్, వీరగంటి రవీందర్, తాడిశెట్టి విద్యాసాగర్ నలుబోల సతీష్, బండారి జనార్ధన్ గౌడ్, ఏసీపి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.