Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Kangati Sridevi: కరువు మండలంగా తుగ్గలిని ప్రకటించాలి

MLA Kangati Sridevi: కరువు మండలంగా తుగ్గలిని ప్రకటించాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీదేవి

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న తుగ్గలి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రసంగించారు. ఇదివరకే పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న వెల్దుర్తి, మద్దికేర, క్రిష్ణగిరి, పత్తికొండ, మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన మండలాల్లో తుగ్గలి మండలం మాత్రమే కరువు మండలంగా ప్రకటించ లేదన్నారు.

- Advertisement -

మండలంలో ఎక్కువ పంటలు నష్టపోయిన రైతులు కలిగి ఉన్నారని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కరువు మండలంగా ప్రకటించాలని, అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వివరించారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే విలేకరులకు ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News