ఫైర్ బ్రాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రతిపక్ష నేతకు యేళ్ళ తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ ను కేటాయించిన వైనం ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లోపే మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
- Advertisement -
39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడంపై ఎమ్మెల్యేలు, మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చ మొదలైంది.