Tuesday, September 17, 2024
HomeతెలంగాణCollector Ila Tripathi on Medram Jathara: మేడారంలో 14,000 మంది పోలీసులు, 4,000...

Collector Ila Tripathi on Medram Jathara: మేడారంలో 14,000 మంది పోలీసులు, 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులు, 6,000 బస్సులు

5,532 టాయిలెట్స్ ఏర్పాటు

గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ” మీడియా ఇంటరాక్షన్ ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగి 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని వీరితో పాటు ఐటిసి, సింగరేణి, సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుధ్య పనులు చేస్తామని తెలిపారు. యానిమల్ కంపోజ్, టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జాతరలో వేస్టేజ్ గల్ఫర్స్ సంఖ్య పెంచామని అన్నారు.
ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేశామని నూతనంగా 230 కొత్త బోర్ వెల్స్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగు లోతట్టు ప్రాంతాలలో మరియు రద్దీ ప్రదేశాలలో గజ ఈతగాలను ఏర్పాటు చేశామని, జాతర సమయంలో 14 – 16 తేదీన లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యశాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని , RTC మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశామని, జాతరకు వచ్చే భక్తులకు 6000 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

- Advertisement -

అనంతరం జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ..

పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జాతరలో 14 వేల మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరలో ప్రత్యేక ప్రణాళికల ద్వారా ట్రాఫిక్ , క్రైమ్ , భక్తుల రద్దీ కంట్రోల్ చేశామన్నారు. వనదేవతలను తీసుకొచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రోప్ పార్టీ ద్వారా దేవతల ప్రతిష్టకు భంగం కలగకుండా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామని, వీఐపీ , వీవీఐపీ ల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తామని జాతరకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిషేట్టి సంకీర్త్ , దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News