తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ NRI-CELL కువైట్ బ్రాంచ్ కో కన్వీనర్ గా సికింద్రాబాద్ ఈసీఎల్ కు చెందిన కళ్యాణి చొప్పలని టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ డాక్టర్ BM వినోద్ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కళ్యాణి చొప్పల్ల చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నియామకం చేశారని తెలిపారు.
శ్రీమతి కళ్యాణి చొప్పల్ల గారి కుటుంబం గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబమని శ్రీమతి కళ్యాణి చొప్పల గారి భర్త శ్రీ శోభన్ బాబు చొప్పల గారు కువైట్ దేశంలో కెమికల్ ఇంజనీర్ గా గత 30 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని వీరికి ఇద్దరు కుమారులు సంతానం విదేశాలలో ఇద్దరు కుమారులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కోవిడ్ 19 సమయంలో కళ్యాణి చెప్పల సేవలు ఘననీయంగా చేశారు. కళ్యాణి చొప్పుల జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ద్వారా పేదలకు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ పేద కుటుంబాలకు అండదండగా నిలుస్తున్నారు శ్రీమతి కళ్యాణి చెప్పల గారు గల్ఫ్ కంట్రీస్ (జిసిసి) దేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మరియు విదేశాలలో పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయుటకు వారి సేవలను వినియోగించుటకు ఈ పదవిని ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ కువైట్ కో- కన్వీనర్ గా పదవి రావడానికి కృషిచేసిన కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే గారికి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గారికి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి మరియు రాష్ట్ర మంత్రివర్గానికి, టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ డాక్టర్ B M వినోద్ కుమార్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రెటరీ రాష్ట్ర ఇన్చార్జ్ విజయ్ కుమార్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ విద్య స్రవంతికి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కస్తూరి నిర్మలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయుటకు కృషి చేస్తానని కళ్యాణి చొప్పల్ల తెలిపారు.