ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ లీడర్ తాను అధ్యక్ష బరిలోకి దిగనున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బైడన్ కు రెండవ దఫా అధ్యక్ష పగ్గాలు వద్దన్న ఆమె.. తాను కొత్త నేతగా ఎదిగేందుకు సరైన వ్యక్తినని భావిస్తున్నట్టు వెల్లడించటం విశేషం. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు. అయితే తాను కచ్ఛితంగా పోటీకి దిగేదీ లేనిదీ ఇప్పటికిప్పుడు చెప్పలేనని రిపబ్లికన్ లీడర్ నిక్కీ అన్నారు. అమెరికా సరికొత్త దిశలో వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని 51 నిక్కీ చెప్పటం విశేషం. రిపబ్లికన్ పార్టీకి కొత్త లీడర్షిప్ అవసరమని ఆమె పేర్కొన్నారు. నవంబర్ 5, 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. బ్రిటన్ ప్రధానిగా రిషి సనాక్ కీలక బాధ్యతల్లో ఉండగా మరో భారత సంతతి వ్యక్తి అగ్రరాజ్యం పగ్గాలు చేపట్టేందుకు ఎన్నికల బరిలోకి దూకేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తిగొలుపుతోంది.
US: అమెరికా అధ్యక్ష పదవి రేసులోకి నిక్కీ హేలీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES