Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Note for Vote: ఇక ‘ఓటుకు నోటు’దే రాజ్యం?

Note for Vote: ఇక ‘ఓటుకు నోటు’దే రాజ్యం?

సుమారు 70ల నుంచి ఎన్నికల్లో ధన ప్రవాహానికి అంతూ బొంతూ ఉండడం లేదు. ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా అభ్యర్థితో, పార్టీతో నిమిత్తం లేకుండా డబ్బును బట్టే ఓటు వేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఎన్నికల కమిషను ఇది తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని అదుపు చేయడం ఎట్లా అన్నదే ఇప్పుడు కమిషన్‌కు ఒక కొరకరాని కొయ్యగా తయారైంది. నిజానికి ఏ సమస్య గురించైనా ఆందోళన చెందడం ప్రారంభించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నికల కమి షన్తో పాటు ప్రజాస్వామ్యవాదులందరికీ ఈ ఓటుకు నోటు వ్యవహారం మీదే దృష్టింతా కేంద్రీకృతనమైంది. ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు ఎన్నికల కమిషన్‌ ఇటీవల సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ సమర్పించింది. ఎన్నికల వ్యయంపై పరిమితి విధించాలని, ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టే అభ్యర్థులను, పార్టీలను కఠినంగా శిక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్కు ఎన్నికల కమిషన్‌ అఫిడవిట్‌ రూపంలో సమాధానమిచ్చింది. ఎన్నికల నిబంధనలను ఎవరు ఏ రూపం లో అతిక్రమించినా అది ప్రజాస్వామ్య ప్రక్రియకు చేటేనని ఆ పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
సుమారు 2010 ప్రాంతంలో బీహార్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు, ఎన్నికల వ్యయంపై పరిమితి విధించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఎన్నికల కమిషన్‌ తన అఫిడవిట్‌ లో గుర్తు చేసింది. సెంటర్‌ ఆఫ్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ 2019 నాటి ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంపై ఎన్నికల కమిషన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తాము ఏర్పాటు చేసిన యంత్రాంగం ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తోందని, నిజానికి ఇప్పుడిక దీని గురించి అంత తీవ్రంగా ఆందోళన చెందనవసరం లేదని, ఇతర అధికార వ్యవస్థలు కూడా తమ ఏర్పాట్లతో సంతృప్తి చెందాయని కమిషన్‌ తన అఫిడవిట్లో పేర్కొంది. అయితే, అభ్యర్థులు, పార్టీలు ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టడం మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్న విషయం మాత్రం తమకు ఆందోళన కలిగిస్తోందని కమిషన్‌ వివరించింది. అయితే, ఎన్నికల్లో పరిమితిని మించి వ్యయం జరుగుతున్న విషయాన్ని, డబ్బు ఏరులై ప్రవహిస్తున్న విషయాన్ని కమిషన్తో సహా ఎవరూ కాదనలేకపోతున్నారు. ఎన్నికలు చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయని గానీ, ప్రజాస్వామ్య ప్రక్రియ ఎటువంటి కళంకమూ లేకుండా సాగిపోతోందని గానీ ఎవరూ చెప్పడం లేదు. ఎన్నికల కమిషన్కు ఏయే మార్గాల నుంచి వ్యయ పరిమితికి సంబంధించిన సమాచారం అందుతోందో తెలియదు. తనకు సమాచారం వచ్చిన మార్గాన్ని మాత్రమే నమ్మాలని ఈ ఆధునిక యుగంలో భావించడం సమంజసం కాదు.
నిజానికి, 2015-20 మధ్య 18 రాజకీయ పార్టీలు ఎన్నికలలో రూ. 6,500 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఎన్నికల నిబంధనల్లోని 90 నిబంధనకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ఎన్నికల కమిషన్‌ అందజేసిన అఫిడవిట్‌లో ఈ నిబంధనను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల కమిషన్‌ ఆడిట్‌ నివేదికలో పార్టీల వారీగా ఎన్నికల వ్యయాన్ని తెలియజేశారు. దానికీ, అసలు వ్యయానికీ ఎక్కడా పొంతన లేదు. విచిత్ర మేమిటంటే, పార్టీలు చేసే వ్యయం మీద పరిమితి లేదు. అందువల్ల పార్టీలు అతిగా ఖర్చుచేసినా దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉండదు. అభ్యర్థుల వ్యయాన్ని అంచనా వేయడానికి వీలుగా పార్టీలు తమ అభ్యర్థికి ఇచ్చిన మొత్తాన్ని బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఒకప్పుడు రూలింగ్‌ ఇచ్చింది. అయితే, ఆ రూలింగ్‌ వర్తించ కుండా ఉండేందుకు, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని 1975లలోనే పార్లమెంట్‌ సవరిం చడం జరిగింది. ఎన్నికల మీద ప్రభుత్వం చేసే ఖర్చును అదుపు చేయడంతో పాటు, పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చును కూడా అదుపు చేయాలని, ప్రతి ఖర్చుకూ లెక్కా పత్రం ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌పై ఈ విధంగా నీళ్లు చల్లడం జరిగింది.
దీనివల్ల, అభ్యర్థులు లేదా పార్టీలు ఎన్నికల్లో ఎన్ని సభలు నిర్వహించవచ్చో, ప్రచారం మీద ఎంత ఖర్చు చేయవచ్చో, అభ్యర్థి తాను ఖర్చు చేసే నిధులను ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగిందో వగైరా వివరాలను ఎన్నికల కమిషన్‌ తెలుసుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ఇక ఎలక్షన్‌ బాండ్‌ స్కీము సవరించడానికి, ఎన్ని కల వ్యయం కోసం ఒక ఉమ్మడి నిధుల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచిది. ఎన్నికల సందర్భంగా జరిగే ప్రతి ఖర్చూ పారదర్శకంగా ఉండా ల్సిన అవసరం ఉంది. ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టి అధికారంలోకి వచ్చే పార్టీల వల్ల సమాజంలో మార్పు రావడం జరిగే పని కాదు. అటువంటి ప్రభుత్వాలు మార్పు రాకూడదనే కోరుకుంటాయి. దేశం లేదా రాష్ట్రం పురోగతి సాధించాలన్నా, సమా జంలో మార్పు రావాలన్నా మొదటగా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News