దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు అయిన జలాభిషేకం,రుద్రాభిషేకం,కుంకుమార్చన, బండారు చందన అభిషేకంతో పాటు ఆకు పూజ నిర్వహించి పూలమాలలతో స్వామి వారిని అలంకరించారు. భక్తులు సాష్టాంగ నమస్కారం చేస్తూ మహిళలు ప్రతి మెట్టుకు ఒక్కో టెంకాయ కొడుతూ, పూలు పెడుతూ, కర్పూరం, బండారు, కుంకుమ పెడుతూ పైకి ఎక్కారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవరగట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Devaragattu: అమావాస్య ప్రత్యేక పూజలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES