గార్ల మండల కేంద్రంలోని వ్యాపారసముదాయలలో వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని, ఎవరైనా వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించారని, నిషేధిత కవర్లు వాడితే 10,000 రూపాయల జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ కవర్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. వీటిని తినడం ద్వారా ఆవులు, గేదెలు చనిపోతాయని, ఇవి భూమిలో కొన్ని లక్షల సంవత్సరాలు నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ సభలో తీర్మానం చేసి వ్యాపార సముదాయలకు ఇచ్చిన నోటీసులను ఉల్లంఘించిన వారి షాపు లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా, గ్రామ పంచాయతీ యాక్ట్ 2018 ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాలలో వచ్చే చెత్తను రోడ్ల మీద గానీ, ఖాళీ ప్రదేశాలలో వేయకుండా చెత్త డబ్బాలలో వేసి పారిశుధ్య సిబ్బందికి అందజేసి, సహకరించాలని సూచించారు.
Garla: ప్లాస్టిక్ కవర్లు వాడితే 10వేల ఫైన్
కవర్లు అమ్మినా, వాడినా షాప్ లైసెన్స్ రద్దు