మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పినా దొర అహంకారపు మాటలు మానుతలేడు అని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏగుర్ల ప్రశాంత్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.. తెలంగాణ తెచ్చింది నేనొక్కన్నే అని కేసీఅర్ చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణా తెచ్చింది నువ్వు ఒక్కనివి కాదు, నీ కుటుంబము కాదని వందల కుటుంబాల ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ అని వెల్లదించారు. నిన్నటి రోజున నల్గొండలో జరిగిన బహిరంగ సభలో శ్రీకాంతాచారిని గుర్తు చేసిన కేసీఅర్ వారీ కుటుంభానికి ఏమి న్యాయం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బజారులో దోరుకవట్టి మమ్మల్ని నిలదీస్తానని కేసీఅర్ మాట్లాడం కాదు.. బజార్లో అవసరం లేదు.., ఒక ఎమ్మెల్యే గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలన్నారు. కేసిఆర్ ఇంటి నంది నగర్ నుండి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న అసెంబ్లీ కి రావటానికి మొహం లేదు కానీ నల్గొండ వెళ్లి మేడిగడ్డ లో 4 పిల్లర్లు కుంగితే ఏం అవుద్ది అని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజా సొమ్మును దుర్వినియోగ పరచడం, కమిషన్లు తినడంలో మీరు దిట్టనీ అందరికీ తెలుసునని తెలిపారు. ప్రజలు ఆల్రెడీ మి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు తో కొట్టి బుద్ధి చెప్పిన.. ఇంకా మి అహంకార ధోరణి తగ్గకపోతే వచ్చే ఎలక్షల్లో కనుమరుగు అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల శ్రీను, గనది కిషన్, చందు, రమణ రెడ్డి, స్వామి, కిరణ్, ఇళ్ళందుల సబ్బు, గౌరు ఉదయ్, తదితరులు ఉన్నారు