శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లోని కృష్ణా నదీ జలాలు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతుండడంతో నదీ జలాలలో జలాధివాసమైన ప్రాచీన సంగమేశ్వరాలయం త్వరలో పూర్తిగా జలాధివాసం నుండి బయటపడనుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుండి 844 అడుగులకు చేరుకున్నది. దీంతో ఆలయం పూర్తిస్థాయిలో బయటపడేందుకు కొద్ది అడుగుల నీటిమట్టం మాత్రమే మిగిలి ఉంది. చుట్టూ ప్రహరీ గోడ బయటపడింది. పూర్తిస్థాయిలో బయటపడి సంగమేశ్వరుడు అతి కొద్ది రోజుల్లో భక్తులచే పూజల అందుకోనున్నాడు.
డి.ఎస్.పి తిరుపాల్ ప్రాచీన సంగమేశ్వర ఆలయం వద్దకు బోటులో వెళ్లి ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రాచీన సంగమేశ్వర ఆలయానికి విచ్చేసిన కర్నూలు జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోకాయుక్త నరసింహారెడ్డి సంగమేశ్వర స్వామికి జలాభిషేకము, రుద్రాభిషేకము, విబూదాభిషేకము, పంచామృత అభిషేకము, అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.