రాయలసీమ నుండి ఆరుగురు ముఖ్యమంత్రిగా రాయలసీమ వాసులే పనిచేసిన నేటికీ రాయలసీమ వెనుకబాటుతనం పోలేదని, రాయలసీమ అభివృద్ధి చెందేది ఇంకెన్నడంటూ.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ నీరున్నా వాడుకోలేని పరిస్థితిలో రాయలసీమ వాసులు ఉన్నారని బైరెడ్డి అన్నారు. ఈ నీళ్లను ఎక్కడికో తీసుకెళ్లి తమ ప్రాంతాలను సశ్యశ్యామలం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే సిద్దేశ్వరంలో నిర్మించ తలపెట్టిన తీగల వంతెనకు బదులు బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మించాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొత్తపల్లి మండలం సిద్దేశ్వరంలో తీగల వంతెన నిర్మిస్తే .. సెల్ఫీలు తీసుకునేందుకు తప్ప ఎందుకూ పనికి రాదన్నారు. ఈనెల 28న చేపట్టిన చలో సిద్దేశ్వరం కార్యక్రమానికి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి రావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.