Friday, November 22, 2024
Homeహెల్త్Newborn health: చిన్న పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే..

Newborn health: చిన్న పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే..

అప్పుడే పుట్టిన చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే

చిన్నారులు హెల్దీగా పెరగాలంటే..

- Advertisement -

నవజాత శిశువు ఆరోగ్యంగా, ఫిట్ నెస్ తో ఉండాలంటే చాలా టిప్స్ ఉన్నాయి. సమతులమైన, పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని చిన్నారులకు పెట్టడం వల్ల మంచి ఆరోగ్యంతో చిన్నారులు పెరుగుతారు. ఇలాంటి హెల్దీ డైట్ తినడం వల్ల బేబీ పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. ఐరన్, కాల్షియం, విటమిన్స్ వంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ శరీర అంగాలతో పాటు ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తాయి. నవజాత శిశువు శరీర ఆరోగ్యాన్ని కూడా ఇవి పరిరక్షిస్తాయి. తల్లిపాలు ఇవ్వడంతో పాటు రకరకాల ఆహార పదార్థాలను బేబీకి పెట్టాలి. వీటితో బేబీ శరీరం ఆరోగ్యంగా పెరుగుతుంది. సిరీల్స్, పప్పుగుజ్జు, పాలకూర, కేల్, పెరుగు, వెన్న, ప్లాంట్ బేస్డ్ మిల్క్, బ్రకోలీ గుజ్జు, మెత్తగా చేసిన అరటిపండ్ల గుజ్జు, బెర్రీ పండ్ల గుజ్జు, ఉడకబెట్టిన చిలకడదుంపల గుజ్టు వీటన్నింటిలో పోషకాలు బాగా ఉండి బేబీ ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే బేబీకి ఏవైనా ఎలర్జీలు, లేదా ప్రత్యేక అనారోగ్య ఇబ్బందులు ఉంటే వైద్యుని సంప్రదించి తదనుగుణంగా బేబీ డైట్ ను ప్లాన్ చేసుకోవాలి. బేబీ ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే బేబీని తప్పనిసరిగా తరచూ వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాలి.

వైద్యుల దగ్గరకు రెగ్యులర్ విజట్స్ చేస్తుండడం వల్ల బేబీ శరీరంలో అంతవరకూ బయటపడని రుగ్మతలు కూడా తెలిసే అవకాశం ఉంది. వీటితోపాటు ఎప్పటికప్పుడు పిల్లల పెరుగుదల, డెవలెప్మెంట్ వంటి వాటిని గమనించుకోగలం. రెగ్యులర్ పీడియాట్రిక్ చెకప్స్ వల్ల బేబీ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. అంతేకాదు బేబీ హెల్త్ హిస్టరీ కూడా బాగా ఉంది. బేబీ వెయిట్, హైట్ గురించి ఎప్పటికప్పుడు కనిపిస్తున్న మార్పులను సైతం వెంటనే తెలుసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలేమైనా ఉంటే సమయానికి బేబీకి అవసరమైన నాణ్యమైన చికిత్సను అందించగలరు. నవజాత శిశువులకు సరైన కాలవ్యవధితో మర్చిపోకుండా అవసరమైన వాక్సినేషన్లను తప్పనిసరిగా చేయించాలి. దీంతో చిన్నారుల ఆరోగ్యం ద్రుఢంగా, పటిష్టంగా ఉంటుంది. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పసిపిల్లలకు తల్లి పాలు తాగించడమనే కాదు బేబీకి, తల్లికి మధ్య గొప్ప బంధాన్ని ఇది ఏర్పరుస్తుంది. తల్లిబిడ్డల మధ్య ఎమోషనల్ కనెక్షన్ తో పాటు ఇద్దరి నడుమ ఒక కంఫర్టు, సెక్యురిటీల రోజురోజుకూ పెరుగుతుంది. తల్లి పాలలో యాంటిబాడీస్ ఎక్కువగా ఉంటాయి. ఎంజైమ్స్, న్యూట్రియంట్లు కూడా బాగా ఉంటాయి. ఇవి బేబీ అవసరాలను తీరుస్తాయి. అంతేకాదు చిన్నారి ఆరోగ్యానికి ఇది పెద్ద భరోసా కూడా.

హెల్త్ అండ్ వెల్నెస్ యాప్ కూడా తల్లి బిడ్డల మధ్య బంధాన్ని ద్రుఢపరుస్తుంది. ఇందులో వాక్సినేషన్ రిమైడర్స్, గ్రోత్ ట్రాకింగ్ చాట్స్, డెవలెప్పెంటల్ మైల్ స్టోన్ చెక్ లిస్టులవంటివన్నీ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బేబీ హెల్త్ రికార్డు మొత్తం ఈ యాప్ లో భద్రంగా ఉంటుంది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తో మంచి కమ్యూనికేషన్ కూడా బేబీ తల్లిదండ్రులకు ఏర్పడుతుంది. అలాగే బేబీ పెరుగుదల సమయంలో పేరెంట్స్ తనకు అవసరమయ్యే పాజిటివ్ ఎన్నిరాన్మెంటును కూడా ఏర్పరచాల్సి ఉంటుంది. ప్రేమ, చిన్నారి మంచిచెడ్డలతో పాటు బేబీకి ఎల్లవేళలా మేమున్నామనే సపోర్టును అందివ్వాలి. అది బేబీలో ఆత్మస్థైర్యాన్ని , భద్రతా భావాన్ని పెంచుతుంది.. పెరిగేకొద్దీ బేబీకి తనపై తనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే కాదు ఆత్మగౌరవం కూడా ఆ బేబీలో సహజసిద్ధంగా పెంపొందుతూ వస్తుంది. ఇవే కాకుండా బేబీకి చిన్నతనం నుంచి చర్మ సంరక్షణ గురించిన అవగాహన పెంచాలి.

Mother and baby spending time in gym


ఆర్గానిక్, జంటిల్ ప్రాడక్టుల వినియోగంపై బేబీలో ఆసక్తిని పెంపొందింపచేయాలి. వాటినే బేబీకి వాడాలి. శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలనే భావనను, బాధ్యతను బేబీలో పసిప్రాయం నుంచి మెల్లమెల్లగా పెంపొందిస్తూ రావాలి. అంతేకాదు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన లైఫ్ స్టైల్ ను చిన్నారులకు అలవాటు చేయాలి. అలాగే పసిపిల్లల శరీర పరిశుభ్రత చాలా ముఖ్యమైంది. గోరువెచ్చటి నీళ్లతో, మైల్డ్ సోప్ తో మాత్రమే బేబీకి నిత్యం స్నానం చేయించాలి. డయపర్ వేసే చోట బాగా శుభ్రం చేయాలి. అలాగే డైపర్ వేసుకోవడం వల్ల ఇరిటేషన్ తలెత్తకుండా ఉండేందుకు డైపర్ వేసే ప్రదేశంలో డైపర్ క్రీమును పసిపిల్లకు నిత్యం అప్లై చేయాలి. చిన్నారులు పెరుగుతున్న సమయంలో చిన్నారి వేళ్ల గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఆ గోళ్లను బేబీకి నొప్పి కలగకకుండా తీసేయాలి. అలాగే ప్రయాణాలలో బేబీకి తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టాలి. ఇంట్లో పసిపాప దోగాడేటప్పుడు ఆ బేబీకి అందకుండా ఎలక్ట్రికల్ పరికరాలు, చిన్న చిన్న వస్తువుల జాగ్రత్త చేయాలి. పిల్లలకు ఆడుకోవడానికి ప్లాస్టిక్ బొమ్మలు ఇస్తుంటారు. వీటి వినియోగించేటప్పుడు పసిపిల్లలకు ఏవైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. ఇంట్లోనే కాదు బయట కూడా ఈ చిన్నారులపై అనుక్షణం సూపర్విజన్ ఉండాలి. పసిబిడ్డల్లో సోషల్ స్కిల్స్ పెంపొందేందుకు అనుగుణంగా పాజిటివ్, సపోర్టివ్ ఎన్విరాన్మెంట్
ను కల్పిస్తూ వారి ఆరోగ్యవంతమైన పెరుగుదలకు పేరెంట్స్ తోడ్పడాలి. అంతేకాదు చిన్నారుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పెంచాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News