బీఆరెస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి కి ఆలయ అధికారులు, చైర్మన్, కమిటీ సభ్యులు పూర్ణ కుంభం తో ఆలయ మర్యాదలు చేసి స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి పరిరక్షణ కోసం పోరాడేలా కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఏడుపాయల ప్రధాన అర్చకులతో ఎమ్మెల్సీ శేరి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి, బీఆరెస్ నాయకులకు ఆలయ చైర్మన్, అర్చకులు శాలువాలతో సన్మానం గావించారు. అనంతరం ఆవరణలో బీఆరెస్ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు.
జై తెలంగాణ, లాంగ్ లివ్ బాపు కేసీఆర్ నినాదాలతో ఎమ్మెల్సీ శేరి అనుచరులు హోరెత్తించారు. ఈ కార్యక్రమం అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో గల బీఆరెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ , మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లు పట్టణ, గ్రామీణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ లో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా తో ఎమ్మెల్సీ శేరి మాట్లాడుతూ కేసీఆర్ ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని, బీఆరెస్ పార్టీని శక్తివంతంగా తయారు చేసి తెలంగాణ ను పరిరక్షించాలని ఏడుపాయల దుర్గమ్మను మొక్కుకున్నానని, తెలంగాణను ఏ విధంగా అయితే కేసీఆర్ సాదించారో, అభివృద్ధి కోసం ఎంత పరితపించారో… తెలంగాణ కోసం అలాగే నిలబడి కొట్లాడుతారని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్సీ శేరి, మాజీ ఎమ్మెల్యే పద్మ లతో పాటు ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, మెదక్ పట్టణ మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు సోములు, పాపన్నపేట్ మండల సర్పంచులు జగన్, శ్రీనాథ్ రావు, మల్లేష్, సంజీవరెడ్డి, వెంకట్రాములు, శ్రీనివాస్, డైరెక్టర్ లు సిద్దిరాములు, యాదా గౌడ్, పార్టీ నాయకులు బాపా రావు, శ్రీనివాస్ గౌడ్, బాబా గౌడ్, సాయి రెడ్డి, భాస్కర్, కౌన్సిలర్ లు కృష్ణా గౌడ్, రాగి అశోక్, కృష్ణా రెడ్డి, rk శ్రీను, మామిల్ల ఆంజనేయులు, పార్టీ అధ్యక్షుడు గంగాధర్, హావేలి ఘనపూర్ మండల సర్పంచులు దేవా గౌడ్, యామిరెడ్డి, మహిపాల్ రెడ్డి, సాయా గౌడ్, నార్ల సాయిలు, శ్రీనునాయక్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.