పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను తరగతి గదిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని, పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత ఫలితాలు రాబట్టడం కోసం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులు కష్టపడాలని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫలితాలలో స్పష్టమైన మెరుగుదల ఉండాలని ఉపాధ్యాయులను సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శీలంశెట్టి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు చింత నిప్పు రమేష్ సంపత్ కుమార్ పద్మావతి ఫయాజ్ కవిత సరోజ భాస్కర్ శ్రీనివాస్ రాము విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.