విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో అన్నారు. గార్ల మండలం పెద్ద కిష్టాపురం గ్రామ పంచాయతీలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తొలుత మార్కుల రిజిస్టర్లను పరిశీలించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విధ్యార్దులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యాసన ఆంగ్లం, గణితానికి సంబంధించిన సామర్థ్యాలను తరగతి గదిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత ఫలితాలు రాబట్టడం కోసం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులు కష్టపడాలని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫలితాలలో స్పష్టమైన మెరుగుదల ఉండాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ హరిప్రసాద్ ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.