కీ.శే. చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా “చెన్నమనేని రాజేశ్వరరావు-లలితా దేవి ఫౌండేషన్” ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లేస్ రోడ్ లోని జలవిహార్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ” శాసనసభలో మూడు దశాబ్దాల ప్రజా వాణి చెన్నమనేని” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే భారత పోస్టల్ విభాగం ద్వార వారి జ్ఞాపకార్ధం పోస్టల్ కవర్, వారి జీవిత కాల విశేషాలను తెలియ జేస్తున్న ఫోటో ప్రదర్షణ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” నిజాయితీకి నిలువుటద్దం, అజాతశత్రువు, నిస్వార్ధసివ, పోరాటాలకు స్ఫూర్తి ఇవన్నీ చెన్నమనేని వ్యక్తిత్వానికి పర్యాయపదాలు అని తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవులు అలంకరించి భావితరాలకు స్ఫూర్తినిచ్చిన అలుపెరగని యోధుడు చెన్నామనేని రాజేశ్వర్ రావు గారన్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు పదమూడెండ్ల ప్రాయంలోనే సిరిసిల్లలో 1935 లో జరిగిన ఆంధ్రమహా సభలకు స్వచ్చంద సేవకులుగా పని చేసారని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు అని చెప్పారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది అని తెలిపారు. శాసన సభలో మూడు దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని” వారి రాజకీయ జీవితాశయాలను, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వారు చేసిన నిరంతర కృషిని ప్రతిబింబిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్, ఎంపీ కె .ఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.