Monday, November 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool collector: ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ రెండు రోజుల్లో పూర్తి కావాలి

Kurnool collector: ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ రెండు రోజుల్లో పూర్తి కావాలి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ వేగవంతం కావాలి

పెండింగ్ ఫార్మ్స్ ను త్వరితగతిన పరిష్కరించాలని, ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన టీములను సోమవారం లోపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత జిల్లా అధికారులతో పెండింగ్ ఫామ్స్, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు, పోలింగ్ స్టేషన్ లలో మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నాటికి పెండింగ్ ఉన్న ఫామ్ 6,8 లను 3 రోజుల్లోపు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.. తర్వాత వచ్చే దరఖాస్తులను ఏరోజుకారోజు పరిష్కరించాలని సూచించారు. ఫార్మ్ 7 కి సంబంధించి 0.1 శాతం దాటితే సీఈఓ కు పంపించాల్సి ఉంటుందని, ఎంత శాతం చేశామో నివేదికను తనకు పంపాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులనుఆదేశించారు. పోలింగ్ స్టేషన్ లలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని కచ్చితంగా తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా టాయ్లెట్ విత్ రన్నింగ్ వాటర్, ర్యాంప్, విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఒకరోజు ముందుగానే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు విధులు నిర్వహించేందుకు వెళతారని, వారికి కూడా ఈ సౌకర్యాలు అవసరం అనే విషయం గుర్తుంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. MCC, FST, SST, EEM, VST, VVT టీములను సోమవారం నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్వో లను ఆదేశించారు.. అదే విధంగా ఈ టీములు శిక్షణ కూడా ఈ నెల 29 వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. సెక్టార్ ఆఫీసర్ లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్ లు పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన వల్నరబిలిటీ మ్యాపింగ్ 2,3 నివేదికలను ఈ నెల 29 వ తేదీ లోపు సిద్దం చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ లకు సంబంధించి లొకేషన్ మార్పు, నామెన్ క్లేచర్ మార్పు, యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ లు ఏమైనా ఉంటే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే యాక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా 200 మీటర్లు పరిధిలో పొలిటికల్ పార్టీ కార్యాలయాలు ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్లో కచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ రెండు రోజుల లోపల పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. చేయలేని వాటికి కారణాలు చెప్తూ నివేదికను పంపాలని ఆదేశించారు. కర్నూల్ అర్బన్, ఆదోని అర్బన్, కర్నూలు రూరల్ లో ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయని, ఇవి తప్ప మిగిలినవన్నీ బుధవారం లోపు పూర్తి చేయాలని సూచించారు.. కర్నూల్ అర్బన్, ఆదోని అర్బన్, కర్నూలు రూరల్ కు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి కావాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్, ఆదోని సబ్ కలెక్టర్ లను ఆదేశించారు. తుగ్గలి, దేవనకొండ, పెద్దకడబూరు, చిప్పగిరి మండలాల్లో ఒకటి, రెండు చొప్పున మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని సంబంధిత తహసీల్దార్ లను ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు. జర్నలిస్టు హౌసింగ్ స్కీం కింద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఆధారంగా ఉండకూడదని కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు.. 5 ఎకరాల పొలం ఉందా, కారు ఉందా లాంటి అంశాలు వెరిఫికేషన్ చెయ్యాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గతంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారా అనే విషయాన్ని వెరిఫై చేయాలని కలెక్టర్ సూచించారు. వెరిఫికేషన్ నివేదిక వచ్చిన తర్వాత కమిటీ సభ్యుల ద్వారా అనర్హులుగా ఉన్న వారిని సోమవారం పిలిపించి, వారికి ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలుసుకోవాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కు సూచించారు. అలాగే ఇళ్ళ స్థలాలకు కావలసిన భూమి అంశం కూడా ఫైనలైజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లో లో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News