Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Akhilapriya: భూమా అంటే కార్యకర్తలకు ధీమా

Akhilapriya: భూమా అంటే కార్యకర్తలకు ధీమా

నమ్మి వస్తున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయం

భూమా అంటే ధీమా అని, భూమా కుటుంబాన్ని నమ్మి తమ వద్దకు వస్తున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. చాగలమరి మండల కేంద్రం ముత్యాలపాడు బస్టాండ్ కాలనీలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో రెండవ వార్డ్ మెంబర్ బషీరున్, కరిముల్లాల తోపాటు మరో నలభై కుటుంబాలు వైకాపాను వీడి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారందరినీ ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోవు ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెబుతారన్నారు.

- Advertisement -

నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యేలు పాటుపడకుండా విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయం వస్తుండడంతో తమ పార్టీకి చెందిన నాయకులు పార్టీ వీడకుండా బ్రతిమలాడుకుంటున్నారున్నారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో కార్యకర్తలను పట్టించుకునే ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. కేవలము మీ జేబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేశారని విమర్శంచారు. ప్రజలందరూ పనిచేసే నాయకుల్ని గుర్తించి ఎన్నికల్లో పట్నం కట్టాలని ఆమె తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి గోగిశెట్టి నరసింహ రావు, టిడిపి యువ నాయకుడు భార్గవరామ్ మండల కన్వీనర్ న్యాయవాది నరసింహారెడ్డి, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ భాష, జిల్లా స్పోక్‌ పర్సన్ సల్లా నాగరాజు, టిడిపి మైనార్టీ నాయకులు కొలిమి హుస్సేన్ వల్లి, కొలిమి మాబు షరీఫ్, జెట్టి నాగరాజు, ముల్లా అజీమ్, ముల్లాగాఫార్, నూర్ భాషా, షాబులు, గుత్తి నర్సింహులు, మౌలాలి, హనీఫ్, ఖలీల్ కొలిమి షబ్బీర్, హుస్సేన్ పీరా, నాగూర్, భాష, బ్రహ్మం, మోహన్ శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News