రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యాక అసెంబ్లీలో నియామక పత్రాన్ని తీస్కున్న అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు విచ్చేసారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భారీ కాన్వాయ్ తో బాణసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యా మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తమ సామాజిక వర్గానికి గొప్ప అవకాశం కల్పించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో గొల్ల కుర్మలు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు పాలికారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరింత మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా చూస్తామన్నారు.
రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ మాట్లాడుతూ చిన్న వయసులో తనకు అధిష్టానం పెద్ద పదవి ఇచ్చిందని ఇది నా జీవితంలో గొప్ప సంఘటన అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హిస్టారికల్ డే ఈ రోజన్న అనిల్ కుమార్, తెలంగాణలో ఒక బీసీ బిడ్డని పెద్దల సభకు పంపుతున్నారంటే ఇది బీసీ అందరికీ గర్వకారణమన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకు మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఇన్ని రోజులు కష్టపడ్డామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న NSUI నాయకులూ ఫోన్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇది అనిల్ కుమార్ విజయం కాదు యువజన కాంగ్రెస విజయం అంటూ వివరించారు.